న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.855 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.834 కోట్లతో పోలి్చతే 3 శాతం పెరిగింది.
ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.10,362 కోట్ల నుంచి రూ.10,609 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.5,003 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.4,141 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు సైతం రూ.9,034 కోట్ల నుంచి రూ.9,475 కోట్లకు ఎగిశాయి. కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏఎంసీ, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ సహా) 10 శాతం పెరిగి రూ.5,50,240 కోట్లకు చేరింది.


