
దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసిక ఫలితాలను (Q2 Results) ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి టీసీఎస్ ఏకీకృత లాభం కేవలం 1.4 శాతం పెరిగి రూ.12,075 కోట్లకు చేరుకుంది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.11,909 కోట్లు. సమీక్షలో ఉన్న త్రైమాసికంలో కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.64,259 కోట్లతో పోలిస్తే 2.4% పెరిగి రూ.65,799 కోట్లకు చేరుకుంది.
టీసీఎస్ డివిడెండ్
టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు ఈక్విటీ షేర్ హోల్డర్లకు రూ.11 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్ అందుకోవడానికి వాటాదారుల అర్హతను నిర్ణయించడానికి టీసీఎస్ డివిడెండ్ రికార్డు తేదీని అక్టోబర్ 15గా నిర్ణయించారు.
ఇదీ చదవండి: అరట్టై అదుర్స్.. ఆ రెండింటిలో లేని ఫీచర్ ఇదే..