అతిపెద్ద ఆర్డర్‌- ఎల్‌అండ్‌టీ జూమ్‌

L&T bags biggest order from Tata Steel for mining equipment - Sakshi

టాటా స్టీల్‌ నుంచి భారీ కాంట్రాక్ట్‌

6.5 శాతం జంప్‌చేసిన ఎల్‌అండ్‌టీ

మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌ సరఫరాకు ఆర్డర్‌

ముంబై, సాక్షి: మెటల్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ నుంచి అతిపెద్ద ఆర్డర్‌ లభించినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ తాజాగా వెల్లడించింది. కాంట్రాక్టులో భాగంగా నిర్మాణం, మైనింగ్‌ సంబంధ ఎక్విప్‌మెంట్‌ను సపఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. టాటా స్టీల్‌కు ఒడిషా, జార్ఖండ్‌లోగల మైన్స్‌కు మొత్తం 46 యూనిట్ల పరికరాలను సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఆర్డర్‌లో భాగంగా 100 టన్నుల కోమత్సు డంప్‌ ట్రక్కులు 41తోపాటు.. 3 వీల్‌ లోడర్లు, 2 క్రాలర్‌ డోజర్లు అందించవలసి ఉన్నట్లు పేర్కొంది. మొత్తం ఆర్డర్‌ విలువను వెల్లడించనప్పటికీ కంపెనీ చరిత్రలో లభించిన అతిపెద్ద ఆర్డర్లలో ఇది ఒకటని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 1154ను తాకింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top