ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్‌ | Life Insurance Corporation began its 68th Insurance Week celebration on sep 1st | Sakshi
Sakshi News home page

LIC: రేపటితో ముగుస్తున్న బీమా వారోత్సవాలు

Sep 6 2024 11:23 AM | Updated on Sep 6 2024 11:23 AM

Life Insurance Corporation began its 68th Insurance Week celebration on sep 1st

దేశీయ బీమా రంగంలో ఎన్ని కంపెనీలున్నా ప్రభుత్వ అధీనంలోని జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)ది ప్రత్యేక స్థానం. ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన ఈ సంస్థ 68వ బీమా వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా సుమారు రూ.నాలుగు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సమకూరుస్తున్న ఈ సంస్థ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  • ఎల్‌ఐసీ సుమారు 15 లక్షల మంది నిరుద్యోగులకు బీమా సలహాదారులుగా ఉపాధి కల్పిస్తోంది.

  • దేశవ్యాప్తంగా 688 జిల్లాస్థాయి జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) కార్యాలయాలున్నాయి.

  • ప్రైవేటు కంపెనీలకు గ్రామీణ ప్రాంతాల్లో 176 శాఖలుంటే, ఎల్‌ఐసీకి 1,224 బ్రాంచీలున్నాయి.

  • ఎల్‌ఐసీ 1956 నుంచి ఇప్పటివరకు రూ.53లక్షల కోట్ల ఆస్తులను సంపాదించింది.

  • దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.43లక్షల కోట్ల మేర పెట్టుబడులు అందించింది.

  • సుమారు 27 కోట్ల మంది వ్యక్తిగత పాలసీదారులున్నారు.

  • 13 కోట్ల గ్రూప్‌ పాలసీదారులకు ఎల్‌ఐసీ సేవలందిస్తోంది.

  • రూ.51.21 లక్షల కోట్ల ఆస్తుల నిర్వహణ(ఏయూఎమ్‌)తో దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తోంది.

  • గడచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.6,104 కోట్ల డివిడెండ్‌ అందించింది.

  • బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇంటర్నేషనల్‌ రిపోర్ట్‌-2024 ప్రకారం ఎల్‌ఐసీ ప్రపంచంలోనే ‘అత్యంత బలమైన బ్రాండ్‌’గా నిలిచింది.

  • ‘ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌’ నివేదిక ప్రకారం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ.

  • గత సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్లను క్లెయిమ్‌ల రూపంలో పాలసీదారులకు చెల్లించింది.

  • ఇటీవలి కేరళ తుపానులో మరణించిన 36 మంది పాలసీదారుల కుటుంబాలకు ఎలాంటి కాగితాలు అడగకుండానే రూ.11 కోట్ల మేర బీమా సొమ్మును అందజేసింది.

ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?

కేంద్ర ప్రభుత్వం 2022లో ఎల్‌ఐసీలోని మూడున్నర శాతం వాటాను ఐపీఓ ద్వారా స్టాక్‌మార్కెట్‌లో విక్రయించింది. ఇందులో భాగంగా సుమారు 40 లక్షల షేర్లు విక్రయించి రూ.21వేల కోట్లను సమకూర్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement