ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంత‌లోనే భారీ షాక్‌!! | Lic Registered A Dip Of New Premium Income | Sakshi
Sakshi News home page

ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంత‌లోనే భారీ షాక్‌!!

Feb 9 2022 9:07 AM | Updated on Feb 9 2022 10:50 AM

Lic Registered A Dip Of New Premium Income - Sakshi

ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంత‌లోనే భారీ షాక్‌!!

న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం 2022 జనవరిలో 2.65 శాతం పెరిగి, రూ.21,957 కోట్లకు చేరింది. రెగ్యులేటర్‌– ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) తాజా గణాంకాలను పరిశీలిస్తే.. 

► దేశంలోకి మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు 2022 జనవరిలో రూ.21,390 కోట్ల కొత్త బిజినెస్‌ ప్రీమియంను వసూలు చేశాయి.  

► ఈ రంగంలో దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ– లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)  కొత్త ప్రీమియం ఆదాయం 2 శాతం. 5పడిపోయి రూ.12,936.28 కోట్లకు చేరింది. 2021 ఇదే నెల్లో ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,144 కోట్లు.  

► ఇక 23 ప్రైవేటు రంగ కంపెనీల కొత్త ప్రీమియం 9.39 శాతం ఎగసి, రూ.8,246.06 కోట్ల నుంచి రూ. 9,020.75 కోట్లకు చేరింది. 

► మొత్తం మార్కెట్‌లో ఎల్‌ఐసీ వాటా 61.15 శాతంగా ఉంది. వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్‌డ్‌) పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఎల్‌ఐసీ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్‌ ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకూ అమలవుతుంది.  

హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలపైనా లేట్‌ ఫీజులో రాయితీ ఈ ఆఫర్‌లో ప్రత్యేకత. ఇక పబ్లిక్‌ ఇష్యూకు రావడానికి కూడా ఎల్‌ఐసీ సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement