
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి రూ.7,324 కోట్లను డివిడెండ్ కింద ఎల్‌ఐసీ చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తానికి చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి అందజేసినట్టు ప్రకటించింది.
ఆగస్ట్ 26న జరిగిన వార్షిక సమావేశంలో డివిడెండ్ పంపిణీకి వాటాదారులు ఆమోదం తెలిపినట్టు వెల్లడించింది. ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ 2025 మార్చి చివరి నాటికి రూ.56.23 లక్షల కోట్లకు చేరుకుందని.. జీవిత బీమా మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్నట్టు తెలిపింది.