ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త..!

LIC offers an opportunity for policyholders to revive lapsed policies - Sakshi

ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వ్యక్తిగత ల్యాప్స్డ్ పాలసీల పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాలసీ ప్రీమియం కాలంలో పాలసీలను మధ్యలోనే నిలిపివేసిన పాలసీదారుల తిరిగి తమ పాలసీల పునరుద్దరణకు ఎల్‌ఐసీ అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022 మధ్య కాలంలో అర్హత కలిగి ఉన్న పాలసీదారులు నిలిచిపోయిన తమ పాలసీని తిరిగి పునరుద్దరించుకోవచ్చు అని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

"ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి వల్ల లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునే వారు పెరుగుతుండటంతో ఎల్ఐసీ పాలసీదారులకు వారి పాలసీలను పునరుద్ధరించడానికి, జీవిత వర్తింపును పునరుద్ధరించడానికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశం" అని బీమా సంస్థ పేర్కొంది. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ బీమా పథకాల పాలసీదారులు ఆలస్యం రుసుములో రాయితీ పొందవచ్చు అని తెలిపింది. ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదు సంవత్సరాల్లోపు ఉన్న కొన్ని అర్హత కలిగిన పాలసీలను పునరుద్ధరించనున్నట్టు ఎల్‌ఐసీ తెలిపింది. అంతేకాకుండా ఆలస్య రుసుములో 20 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొంది. 

(చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top