ఎల్ఐసి కొత్త చైర్మన్‌గా సిద్ధార్థ మహంతి

lic new chairman siddharth mohanty - Sakshi

ఎంపిక చేసిన ఎఫ్‌ఎస్‌ఐబీ 

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ నూతన సారథిగా సిద్ధార్థ మహంతిని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) గురువారం ఎంపిక చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లు, సారథుల ఎంపికను ఎఫ్‌ఎస్‌ఐబీ చూస్తుంటుంది. నిబంధనల ప్రకారం నలుగు మేనేజింగ్‌ డైరెక్టర్ల నుంచి చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. మొత్తం మీద అనుభవం, ఇతర అంశాల ఆధారంగా ఎల్‌ఐసీ చైర్‌పర్సన్‌ పదవికి సిద్ధార్థ మహంతిని సిఫారసు చేసినట్టు ఎఫ్‌ఎస్‌ఐబీ ప్రకటన విడుదల చేసింది. 

ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫారసుపై తుది నిర్ణయాన్ని ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ తీసుకుంటుంది. ఒకవేళ మహంతి నియామకం ఖరారు కాకపోతే ఆయన ఈ ఏడాది జూన్‌ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎల్‌ఐసీ చైర్మన్‌గా ఎంపికైతే 62 ఏళ్లు వచ్చే వరకు కొనసాగొచ్చు. ఇతర ఉన్నత ఉద్యోగులకు రిటైర్మెంట్‌ వయసు 60 ఏళ్లుగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top