L&T Finance to Offer Two Wheeler Loans on Royal Enfield - Sakshi
Sakshi News home page

టూవీలర్‌ కొనుగోలు దారులకు బంపర్‌ ఆఫర్‌!

Jan 11 2022 6:45 PM | Updated on Jan 11 2022 7:41 PM

L And T Finance To Offer Two Wheeler Loans On Royal Enfield - Sakshi

టూవీలర్‌ కొనుగోలు దారులకు బంపర్‌ ఆఫర్‌!

టూవీలర్‌ కొనుగోలు దారులకు ఎల్‌ అండ్‌ టీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 'వెల్‌కమ్‌ 2022' లో భాగంగా కొనుగోలు దారులకు భారీ ఎత్తున లోన్‌ ఆఫర్‌ ఇస్తున్నట్లు తెలిపింది.  

హైపోథికేట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 3నిమిషాల్లో 7.99 శాతం నుంచి వడ్డీతో అందిస్తున్నట్లు వెల్లడించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొనుగోలు చేసిన కొనుగోలు దారులు తీసుకున్న లోన్‌ను 4ఏళ్లలో చెల్లించవచ్చని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎక్జిగ్యూటీవ్‌ డైరక్టెర్‌ బి. గోవిందరాజన్‌ చెప్పారు. కంపెనీ డీలర్ల దగ్గర లేదా ఎల్‌‌ అండ్‌‌‌‌‌‌ టీ ఫైనాన్స్ బ్రాంచ్‌  ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల దగ్గర ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను పొందవచ్చు. లేదా కంపెనీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ www.ltfs.com  లోకి వెళ్లి ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద  లోన్​కు అప్లై చేసుకోవచ్చు. క్లాసిక్‌‌‌‌‌‌‌‌ 350, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 650, కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌ జీటీ 650 ట్విన్స్‌‌‌‌‌‌‌‌, హిమాలయన్ వంటి బైక్‌‌‌‌‌‌‌‌లను రాయల్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌  అమ్ముతుంది. 

ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్ ప్రకారం బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ టర్నరౌండ్ టైమ్ (టీఏటీ) లో భాగంగా..ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, రాయల్ ఎన్‌ఫీల్డ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలు,పట్టణాల్లోని కస్టమర్‌లకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌పై లోన్‌ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

చదవండి: అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement