డౌన్‌లోడ్‌లో దూసుకెళ్తున్న ఇండియన్‌ ‘కూ’ యాప్‌

Koo Reaches 15 Million User Base - Sakshi

ట్విటర్‌కు పోటీగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయుల కోసం ‘కూ’ మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియా యాప్‌ అందుబాటులోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు "కూ" సోషల్ మీడియా యాప్‌ను భారతీయులు భారీగానే ఆదరిస్తున్నారు. కూ యాప్‌ను ప్రారంభించిన 3 నెలల కాలంలోనే 5 మిలియన్ల యూజర్లను సొంతం చేరుకొని మొత్తం దీనిని 15 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. విదేశీ సోషల్‌ మీడియా యాప్స్‌తో పోటీపడుతూ ‘కూ’ యాప్‌ దూసుకెళ్తోంది. 

స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ కూ యూజర్ బేస్ ఇప్పుడు సుమారు 15 మిలియన్లకు చేరుకుంది. గత త్రైమాసికంలోనే ఐదు మిలియన్ల కొత్త వినియోగదారులు యాప్ డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. జూన్ 2022 తర్వాత ఆగ్నేయాసియా మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నప్పటికీ "కూ" భారత మార్కెట్ పై పట్టు కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం నైజీరియాలో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది. అక్కడ కూడా యాప్‌ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో నైజీరియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. నైజీరియాలో ఆశించిన మేర ఆదరణ ఉన్నట్లు సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించడానికి నైజీరియా, ఇతర ఆఫ్రికా దేశాలలో విస్తరణ పనులు వేగవంతం చేస్తుంది.

(చదవండి: సరికొత్త యాప్‌ను లాంచ్‌ చేయనున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top