రూ.లక్షల కోట్ల వ్యాపారం.. ఈ కోడలివే కీలక బాధ్యతలు | Meet Karishma Shanghvi, Daughter In Law Of Indias Richest Pharma Billionaire Dilip Shanghvi, Know Details About Her | Sakshi
Sakshi News home page

రూ.లక్షల కోట్ల వ్యాపారం.. ఈ కోడలివే కీలక బాధ్యతలు

Jan 29 2025 8:42 PM | Updated on Jan 30 2025 3:13 PM

Karishma Shanghvi daughter in law of Indias richest pharma billionaire Dilip Shanghvi

చాలా మంది భారతీయ బిలియనీర్లు తమ వ్యాపారాల్లో కీలక బాధ్యతలను తమ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు కూడా ఆ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాంటి వారిలో కరిష్మా షాంఘ్వి (Karishma Shanghvi) ఒకరు.

దేశంలోని అత్యంత సంపన్నమైన ఫార్మా బిలియనీర్ దిలీప్ షాంఘ్వీకి (Dilip Shanghvi) కోడలు కరిష్మా షాంఘ్వి. రూ.4.40 లక్షల కోట్ల సంస్థ అయిన సన్ ఫార్మాకు (Sun Pharma) ఆయన చైర్మన్, ఎండీ. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్‌ 28.7 బిలియన్ డాలర్లు. సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన తన కుమారుడు అలోక్ షాంఘ్వీని కరిష్మా వివాహం చేసుకున్నారు.

చురుగ్గా సామాజిక కార్యక్రమాలు
సన్ ఫార్మాకు సంబంధించిన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూ కరిష్మా షాంఘ్వి మంచి పేరు తెచ్చుకున్నారు. దేశంలోని ప్రముఖ చమురు, గ్యాస్ కంపెనీ దిలీప్ షాంఘ్వీ ప్రమోట్ చేసిన  సన్ పెట్రోకెమికల్స్‌లో డైరెక్టర్‌గా కూడా ఆమె వ్యవహరిస్తన్నారు.

ముంబైలో తక్కువ ఖర్చుతో మెరుగైన విద్యను అందించే అంతర్జాతీయ పాఠశాల అయిన శిఖా అకాడమీకి కరిష్మా డైరెక్టర్, వ్యవస్థాపకురాలు. ఇది అల్పాదాయ వర్గాల పిల్లలకు సేవలు అందిస్తోంది. అలాగే విద్య ఆరోగ్య సంరక్షణ రంగాలలో సేవలందిస్తున్న శాంతిలాల్ షాంఘ్వీ ఫౌండేషన్‌తో కూడా ఆమె కలిసి పనిచేస్తున్నారు.

ఉన్నత విద్యావంతురాలు
అశోకా యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో కూడా కరిష్మా సభ్యురాలిగా ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి విద్యలో మాస్టర్స్ డిగ్రీ (Ed.M.) పొందిన ఆమె వార్టన్ స్కూల్ నుండి ఎకనామిక్స్‌లో బీఎస్‌ చదివారు. అలాగే బయో ఇంజినీరింగ్‌లో బీఏఎస్‌, బయోటెక్నాలజీలో ఎంస్‌, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో మైనర్‌ పూర్తి చేశారు. ఇవన్నీ యూఎస్‌లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement