IPL2023 Shah Rukh Khan Right Hand, KKR CEO Venky Mysore Success Story In Telugu - Sakshi
Sakshi News home page

IPL 2023: షారుక్ రైట్‌ హ్యాండ్‌, కేకేఆర్‌ సీఈవో గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలు 

Published Fri, Apr 7 2023 1:25 PM | Last Updated on Wed, Apr 19 2023 4:02 PM

IPL2023 Shah Rukh Khan right hand f KKR CEO Venky Mysore success story - Sakshi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాపులర్‌ జట్లలో ఒకటి  కోల్‌కతా నైట్ రైడర్స్ .రెండుసార్లు( 2012 , 2014లో) ఐపీఎల్‌ టైటిల్‌ను దక్కించుకుని క్రికెట్‌ ఫ్యాన్స్‌ను  ఉర్రూతలూగించింది. తాజాగా ఐపీఎల్‌ 2023 పోరు నడుస్తున్న సందర్భంగా, షారుక్‌ ఖాన్‌ కుడిభుజం లాంటివాడు, కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్  నెట్‌వర్త్‌ తదితర విషయాలపై ఆసక్తి  నెలకొంది.

ఐపీఎల్‌ క్రికెట్‌ ఫ్రాంచైజీ కేకేఆర్‌ యజమాని, బాలీవుడ్‌ స్టార్‌హీరో  షారుక్ ఖాన్‌ దేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఓనరు కూడా. అలాగే కేకేఆర్‌ సీఈవోఅయిన వెంకీ రెడ్‌ చిల్లీస్‌ సీఈవో కూడా కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్‌ చిల్లీస్‌కు సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు వెంకీ  . అనుభవజ్ఞుడైన వ్యాపార నిపుణుడు రెడ్ చిల్లీస్‌కు  సీఈవోగా ఉండడం చాలా ఆనందంగా ఉందని,కేకేర్‌లో అద్భుతంగా పనిచేసిన వెంకీ రెడ్ చిల్లీస్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెడతానే నమ్మకం ఉందని షారుక్ ఖాన్ ప్రకటించారు.

అనేక గ్లోబల్ మార్కెట్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమలో 25 సంవత్సరాలు, అమెరికా,  కెనడా, ఆసియాలో అనేక సీనియర్ నాయకత్వ స్థానాల్లో పనిచేసిన అనుభవం వెంకీ సొంతం.క్రికెటర్‌ అవ్వవాలనుకున్న వెంకీ క్రికెట్ జట్టు సీఈవోగా అవతరించాడం విశేషం. ప్రస్తుతం  కేకేఆర్‌, రెడ్‌ చిల్లీస్‌ బాధ్యతలను చూస్తున్న వెంకీ మైసూర్ నికర విలువ మీడియా కథనాల ప్రకారం దాదాపు రూ.14 కోట్లు. (సర్కార్‌  కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్‌ సింగ్‌?)

కర్ణాటకలోని మైసూర్‌లో పుట్టారు వెంకీ. క్రికెటర్‌గా రంజీ ట్రోఫీకి చేరాలని కలలుకన్న వెంకీ తండ్రి కోరికనుమన్నించి క్రికెట్ నుండి తప్పుకుని  మద్రాస్ విశ్వవి ద్యాలయంలో మార్కెటింగ్ అండ్‌ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. (గుడ్ ఫ్రైడే  ఆఫర్‌: రూ.1500కే నథింగ్ ఫోన్ (1))

కేకేఆర్‌లో చేరడానికి ముందు వెంకీ మైసూర్‌కు బీమా పరిశ్రమలో పెద్ద పేరే ఉంది. 2010లో, వెంకీ మైసూర్ మెట్‌లైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో, అన్నింటినీ విడిచిపెట్టి, షారుక్‌ ఖాన్‌ కేకేఆర్‌ ఫ్రాంచైజీలో చేరారు. అసలు కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను కొనుగోలు  ప్లాన్‌ వెనుక వెంకీ ఉన్నట్టు క్రీడా వర్గాలు నమ్ముతారు. బెంగుళూరులోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. వెంకీ భార్య పేరు వీణ, ముగ్గురు పిల్లలున్నారు. 

కాగా ఐపీఎల్‌ 2022లో పేలవ ప్రదర్శనపై వెంకీపై  విమర్శలొచ్చాయి. అలాగే టీం సెలక్షన్‌లో జోక్యం చేసుకుంటు న్నాడంటూ కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోపణలు వీటికి మరింత ఆజ్యం పోసాయి. అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్ లాంటిది కాదు. ఓనర్‌లుప్రత్యక్షంగా పాల్గొనక పోయిన సమయంలో తమ అభిప్రాయాలను సీఈవో ద్వారా లేదా ప్రధాన కోచ్‌తో  నేరుగా మాట్లాడతారని  ఫ్రాంచైజీ  తిప్పికొట్టింది. 

కేకేఆర్‌ విజయపథంలో నడిపిండం ద్వారా అనేక లాభాలను తెచ్చిపెట్టారు వెంకీ. ఫోర్బ్స్ ప్రకారంకేకేఆర్‌ నికర విలువ 1.1 బిలియన్లు డాలర్లు, ఆదాయం 41.2 మిలియన్‌ డాలర్లు. 2004లో స్థాపించిన డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్ సంస్థను కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌కే, గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్‌గా మార్చారు. రెడ్ చిల్లీస్ పది చిత్రాలకు నిర్మాతగా, ఐదు చిత్రాలకు సహనిర్మాతగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement