Bug in iPhone iOS15: ఐఫోన్‌ యూజర్లకు కొత్త సమస్య...! డిలీట్‌ చేస్తే అంతే..!

Ios 15 Bugs Deleting Photos Freezing Mail App More - Sakshi

గత వారం ఐఫోన్లకు ఐవోఏస్‌ 15ను ఆపిల్‌ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఐవోఎస్‌15 సాఫ్ట్‌వేర్‌లో బగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఐఫోన్లను అప్‌డేట్‌ చేసిన వారికి  ఈ సమస్య  తలెత్తుంది.

యూజర్లు కొత్త ఐవోఎస్‌ వెర్షన్‌కి అప్‌డేట్ చేసిన తర్వాత, మెసేజెస్ యాప్‌లో ఫోటోస్‌ థ్రెడ్‌ని  డౌన్‌లోడ్‌ చేశాక థ్రెడ్‌ను డిలీట్‌ చేయగానే ఫోన్‌ మెమరీలో కన్పించడం లేదంటూ తెలుస్తోంది. మరికొంత మంది యూజర్లకు  డిఫాల్ట్ కెమెరా యాప్ కొన్నిసార్లు నాన్-ఫంక్షనల్ వ్యూఫైండర్‌ను ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతున్నట్లు  ఫిర్యాదు చేశారు. ఐఫోన్ వేకప్‌లో కూడా సమస్యలు ఉ‍న్నట్లు  యూజర్లు గుర్తించారు. అంతేకాకుండా డిఫాల్ట్ మెయిల్ యాప్‌ కూడా నిలిచిపోతున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: Rolls-Royce: రోల్స్‌రాయిస్‌ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ కార్‌పై ఓ లుక్కేయండి..!

దృష్టిలోపం ఉన్నవారికి ఐఫోన్లలోని సిరి అందించే కామండ్స్‌ను కూడా ఈ బగ్‌ తొలగిస్తున్నట్లు తెలుపోతుంది. అంతేకాకుండా మునపటి వెర్షన్లలో కూడా కామండ్స్‌ పనిచేయడం లేదు. దీంతో  యూజర్లు  ఆపిల్‌ సపోర్ట్‌ కమ్యూనిటీ ఫోరమ్స్‌కు రిపోర్ట్‌ చేస్తున్నారు. కాగా ఆపిల్‌ ఈ సమస్య స్పందించలేదు. మెసేజ్‌ యాప్‌ థ్రెడ్‌ నుంచి ఫోటోస్‌ థ్రెడ్‌ను డిలీట్‌ చేయకుండా ఉంటే ఫోన్‌ మేమోరీలోను ఉంటాయి. ఆపిల్‌ ఈ బగ్‌ సమస్యను పరిష్కరించే వరకు ఈ పద్దతినే ఫాలో అవ్వడం ఉత్తమమని టెక్నికల్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. 
చదవండి: భారత్‌లో ఊపందుకొనున్న స్టార్‌లింక్‌ శాటిలైట్‌ సేవలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top