I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు! | Interesting Details About I am Not A Robot | Sakshi
Sakshi News home page

I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!

Published Thu, Oct 12 2023 5:36 PM | Last Updated on Thu, Oct 12 2023 9:40 PM

Interesting Details About I am Not A Robot - Sakshi

సాధారణంగా మనం కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ (I am not a robot) అని వస్తూ ఉంటుంది. దీనితో చాలా మంది విసుగెత్తిపోతారు. ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది? హిస్టరీ ఏమైనా గూగుల్ తెలుసుకుంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్‌లో చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి, ఇందులో కొన్నింటిని ఓపెన్  చేయాలనంటే ‘నేను రోబో కాదు’ (I am not a robot) అని నిర్దారించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో స్క్రీన్ మీద చిన్న బాక్స్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

నిజానికి స్క్రీన్ మీద ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ (I am not a robot) కనిపించగానే ఎవరైనా వెంటనే క్లిక్ చేస్తే, అప్పుడు గూగుల్ నేను రోబో కాదు అని భావిస్తుందనుకుంటారు. కానీ ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే బ్రౌసింగ్ హిస్టరీ మొత్తం గూగుల్‌కి తెలిసిపోతుంది.

ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్

గతంలో ఒకసారి బీబీసీ క్విజ్ షోలో ఇలాంటిదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో 'ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే ఏమి జరుగుతుందనేది వెల్లడిస్తారు. అంటే అప్పటి వరకు పనిచేసింది మనిషేనా లేదా రోబోనా అని నిర్దారించుకోవడానికి ఇలా వస్తుందని తెలుస్తోంది.

ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం (అప్పటివరకు మీరు ఏమి సర్చ్ చేశారో) గూగుల్‌కి అందించడానికి అంగీకరించినట్లే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఐ యామ్ నాట్ ఏ రోబోట్ బాక్స్ మీద క్లిక్ చేసిన తరువాత కొన్ని పజిల్స్‌లాగా వస్తాయి. అప్పుడు వాటిని క్లియర్ చేసిన తరువాత కావలసిన సైట్ ఓపెన్ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement