InsuranceDekho acquires Verak to expand SME insurance space - Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్స్‌దేఖో చేతికి వేరక్‌

Apr 11 2023 9:11 AM | Updated on Apr 11 2023 10:06 AM

Insurancedekho Acquires Verak - Sakshi

న్యూఢిల్లీ: దేశీ బీమారంగ స్టార్టప్‌ ఇన్సూరెన్స్‌దేఖో తాజాగా ముంబై సంస్థ వేరక్‌ను కొనుగోలు చేసింది. ఎస్‌ఎంఈ ఇన్సూరెన్స్‌ పంపిణీ సంస్థ వేరక్‌ను సొంతం చేసుకున్నట్లు ఇన్సూరెన్స్‌దేఖో వ్యవస్థాపకుడు, సీఈవో అంకిత్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

వేరక్‌ ప్రారంభమైనప్పటినుంచి పటిష్టంగా ఎదుగుతున్నట్లు, కొత్త విభాగం మైక్రోబిజినెస్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌లో విస్తరించినట్లు అగర్వాల్‌ పేర్కొన్నారు. తద్వారా తొలిసారి చిన్న వర్తకులను బీమా పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలియజేశారు. ప్రతీ నెలా ప్రీమియంలో 30 శాతం నెలవారీ వృద్ధిని సాధిస్తున్నట్లు వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement