Infinix Zero 5G Specifications And Price In India: దేశీయ మార్కెట్‌లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో మ‌రో 5జీ ఫోన్! - Sakshi
Sakshi News home page

రూపాయికే బ్లూటూత్..!! దేశీయ మార్కెట్‌లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో మ‌రో 5జీ ఫోన్!

Feb 17 2022 7:10 AM | Updated on Feb 17 2022 12:00 PM

Infinix Zero 5g Price In India - Sakshi

రూపాయికే బ్లూటూత్..!! దేశీయ మార్కెట్‌లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో మ‌రో 5జీ ఫోన్!

న్యూఢిల్లీ: ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హ‌వా కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో ఇన్ఫినిక్స్‌ తొలి 5జీ ఫోన్‌ను ‘జీరో 5జీ’ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది.
 
ఫీచ‌ర్లు, ధ‌ర‌లు 

►మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుంది.

►13 5జీ బ్యాండ్లకు సపోర్ట్‌ చేస్తుంది.

►అత్యధిక 5జీ బ్యాండ్లు కలిగిన ఫోన్‌ ఇదే 

►8జీబీ ర్యామ్‌ (5జీ ర్యామ్‌ ఎక్స్‌పాండబుల్‌), 128జీబీతో వచ్చే దీని ధర రూ.19,999.

►ఫ్లిప్‌కార్ట్‌పై ఈ నెల 18 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి. 

►ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.999 విలువ చేసే ఇన్ఫినిక్స్‌ స్నాకర్‌ (ఐరాకర్‌)ను కేవలం రూ.1కే అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.

►ఆండ్రాయిడ్‌ తాజా వెర్షన్‌ 11పై పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సదుపాయంతో ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement