నియామకాల్లో వైవిధ్యానికి ప్రాధాన్యం  | India white-collar recruitment falls 4percent in May 2026 | Sakshi
Sakshi News home page

నియామకాల్లో వైవిధ్యానికి ప్రాధాన్యం 

Jun 7 2026 5:31 AM | Updated on Jun 7 2026 5:31 AM

India white-collar recruitment falls 4percent in May 2026

మేలో వైట్‌కాలర్‌ హైరింగ్‌లో 4% క్షీణత 

డైవర్సిటీ నియామకాల్లో 21% వృద్ధి 

టూరిజం, ఆటో రంగాల్లో ఉపాధి జోరు 

ఫౌండిట్‌ ఇన్‌సైట్స్‌ ట్రాకర్‌ నివేదిక

ముంబై: దేశవ్యాప్తంగా వైట్‌కాలర్‌ ఉద్యోగాల నియామకాలు మే నెలలో మందగించాయి. గత ఏడాది (2025) ఇదే నెలతో పోలిస్తే నియామకాలు 4 శాతం తగ్గగా, ఈ ఏప్రిల్‌తో పోలిస్తే 6 శాతం క్షీణించాయి. మారుతున్న మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో సంస్థలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండటమే దీనికి కారణమని జాబ్‌ సెర్చ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫౌండిట్‌ విడుదల చేసిన తాజా ‘ఫౌండిట్‌ ఇన్‌సైట్స్‌ ట్రాకర్‌ (ఫిట్‌)’ నివేదిక వెల్లడించింది. ఫౌండిట్‌ డాట్‌ ఇన్‌లో నమోదైన 7,39,188 ఆన్‌లైన్‌ ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.  

టూరిజం, ఆటోలో జోరు.. లాజిస్టిక్స్, రిటైల్‌లో స్తబ్దత 
వార్షిక ప్రాతిపదికన ట్రావెల్, టూరిజం రంగం 26 శాతం వృద్ధితో నియామకాల పెరుగుదలలో అగ్రస్థానంలో నిలిచింది. ఆటోమొబైల్‌ రంగంలో నియామకాలు 12 % పెరగగా, హెల్త్‌కేర్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో 11% వృద్ధి నమోదైంది. మరోవైపు దిగుమతులు–ఎగుమతుల రంగంలో నియామకాలు 23 శాతం తగ్గాయి. లాజిస్టిక్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగంలో 18%, రిటైల్‌ రంగంలో 8%, బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో కూడా 8% నియామకాలు క్షీణించినట్లు నివేదిక వెల్లడించింది. 

ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ ముందంజ 
డైవర్సిటీ నియామకాల పరంగా ఐటీ–సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సరీ్వసెస్‌ రంగం 25 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రంగంలో నమోదైన మొత్తం డైవర్సిటీ నియామకాల్లో ఎల్‌జీబీటీక్యూఐఏ ప్లస్, న్యూరోడైవర్స్‌ అభ్యర్థుల వాటా 40 % వరకు ఉండటం విశేషం. మహిళల నియామకాల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం 62 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం ఎఫ్‌ఎంసీజీ రంగం 61%, హెల్త్‌కేర్‌ రంగం 60 శాతంతో నిలిచాయి. కాగా, దివ్యాంగుల నియామకాలు ఐటీఈఎస్‌/బీపీఓ రంగంలో 18 శాతం, తయారీ, ఆటోమొబైల్‌ రంగాల్లో 16 శాతం నమోదయ్యాయి. కన్సలి్టంగ్, అనలిటిక్స్‌ రంగం డైవర్సిటీ నియామకాల వాటాను 14 శాతానికి పెంచుకుంది. 

దీర్ఘకాలిక సామర్థ్యాలపై దృష్టి .. 
‘‘ప్రస్తుతం సంస్థలు నియామకాల విషయంలో మరింత ఎంపిక(సెలెక్టివ్‌గా)తో వ్యవహరిస్తున్నాయి. అయితే దీర్ఘకాలిక వ్యాపార వృద్ధికి తోడ్పడే విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడట్లేదు. నాయకత్వ స్థాయి బాధ్యతలు, టెక్నాలజీ విభాగాల్లో డైవర్సిటీ నియామకాలు పెరగడం అనేది భారతీయ కార్పొరేట్‌ రంగ  పరిణతికి నిదర్శనం’’ అని అని ఫౌండిట్‌ సీఈఓ తరుణ్‌ సిన్హా తెలిపారు.  

డైవర్సిటీ హైరింగ్‌ జోరు.. 
మొత్తం నియామకాలు తగ్గినప్పటికీ.., డైవర్సిటీ (వైవిధ్య) నియామకాలు మాత్రం వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగాయి. సమ్మిళిత ఉద్యోగ వ్యవస్థలను బలోపేతం చేసే వ్యూహాలపై సంస్థలు కట్టుబాటుతో వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని ఇది సూచిస్తోంది. డైవర్సిటీ నియామకాల్లో మహిళల వాటా 56 శాతంగా నమోదైంది. గత రెండేళ్లలో దివ్యాంగుల (పీపుల్స్‌ విత్‌ డిసెబిలిటీస్‌–పీడబ్ల్యూడీ) నియామకాలు మూడింతలు పెరిగి మొత్తం డైవర్సిటీ నియామకాల్లో 12 శాతానికి చేరాయి. ఎల్‌జీబీటీక్యూఐఏప్లస్, న్యూరోడైవర్స్‌ అభ్యర్థుల నియామకాలు కూడా పెరిగి, మొత్తం డైవర్సిటీ హైరింగ్‌లో దాదాపు మూడో వంతు వాటాను సాధించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement