రికార్డు స్థాయిలో పెరిగిన దేశ జీడీపీ

India Records Q1 FY22 GDP Growth at Above 20 Percent on Low Base - Sakshi

మన దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రికార్డు స్థాయిలో పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రికార్డు స్థాయిలో 20.1 శాతంగా పెరిగినట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏప్రిల్-జూన్ 2020 కాలంలో భారతదేశం ప్రధానంగా మొదటి కరోనా వైరస్ కారణంగా జీడీపీ భారీగా దెబ్బతింది. జీడీపీ వృద్ది రేటు -24.4 శాతానికి పడిపోయింది. "క్యూ1ఎఫ్ వై22లో స్థిరమైన(2011-12) ధరల వద్ద జీడీపీ వృద్ది రేటు క్యూ1 ఎఫ్ వై21లో 24.4 శాతం సంకోచంతో పోలిస్తే 20.1 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా వివిధ ఆర్థిక సంస్థలు ఏప్రిల్-జూన్ 2021 త్రైమాసికంలో జీడీపీ రికార్డు స్థాయిలో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఇఏ) కె సుబ్రమణియన్ భారతదేశ స్థూల ఆర్థిక మౌలికాంశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పారు. "క్యూ1 జిడిపి భారత ఆర్థిక వ్యవస్థ వి-ఆకారంలో రికవరీని పునరుద్ఘాటిస్తుంది. భారత దేశం తీసుకున్న సంస్కరణలు ఆర్థిక రికవరీ సమన్వయ వేగాన్ని పెంచినట్లు'' అని ఆయన అన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడీపీ వృద్ధి రేటు 21.4 శాతంగా అంచనా వేసింది. ఎస్‌బీఐ రీసెర్చ్ తన తాజా ఎకోర్ప్ నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి సుమారు 18.5 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, క్యూ1 ఎఫ్ వై22లో జీవిఏ 15 శాతంగా ఉంటుందని పేర్కొంది.(చదవండి: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top