ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్

India may get Moderna inc Covid-19 vaccine through COVAX - Sakshi

కోవాక్స్‌ద్వారా సరఫరాకు చాన్స్‌

పేద, మధ్యాదాయ దేశాలకూ వ్యాక్సిన్

‌ 2021కల్లా 200 కోట్ల డోసేజీల పంపిణీ లక్ష్యం 

ముంబై: కరోనా వైరస్‌ కట్టడిలో 94.5 శాతం విజయవంతమైనట్లు తాజాగా పేర్కొన్న యూఎస్‌ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్‌ వ్యాక్సిన్‌ దేశీయంగా అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కోవాక్స్‌ సౌకర్యాల ద్వారా ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశాయి. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఎపిడిమిక్‌ ప్రిపేర్‌డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ సహకార సమితి(సీఈపీఐ) నుంచి గతంలోనే మోడర్నా ఇంక్‌కు నిధుల సహాయం అందినట్లు వివరించాయి. సీఈపీఐ కోవాక్స్‌లో భాగంకావడంతో ఇండియా సైతం వ్యాక్సిన్‌ను పొందనున్నట్లు తెలియజేశాయి. చదవండి: (పసిడి- వెండి అక్కడక్కడే..)

2 బిలియన్లు
వచ్చే ఏడాది(2021) చివరికల్లా కోవాక్స్‌ సౌకర్యాల ద్వారా పేద, మధ్యాదాయ దేశాలకు 2 బిలియన్‌ వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోవాక్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెల్త్‌కేర్‌ రంగ నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది జనవరిలో మోడర్నా ఇంక్‌కు సీఈపీఐ 1 మిలియన్‌ డాలర్లను విడుదల చేసింది. తద్వారా మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో వ్యాక్సిన్‌ అభివృద్ధికి పాక్షికంగా నిధులు అందజేసింది. ఈ నిధుల సమీకరణ కారణంగా మోడర్నా ఇంక్‌ పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 2016లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఈపీఐ రూపొందింది. వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీ, నిల్వలకు ఉద్ధేశించి సీఈపీఐను ఏర్పాటు చేశారు. చదవండి: (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్‌ మస్క్‌?)

ఒప్పందం లేదు
దేశీ ఫార్మా కంపెనీలతో మోడర్నా ఇంక్‌కు ఒప్పందాలేవీ లేవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దీంతో మోడర్నా తొలుత వ్యాక్సిన్‌ను యూఎస్‌ ప్రభుత్వానికి సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేశాయి. మోడర్నా ఇంక్ ఆచరించిన ఎంఎన్‌ఆర్‌ఏ పద్ధతిలోనే ఫైజర్‌ ఇంక్‌ సైతం వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఈ వ్యాక్సిన్‌ సైతం 90 శాతంపైగా ఫలితాలు సాధించినట్లు ఇప్పటికే యూఎస్‌ హెల్త్‌కేర్‌ దిగ్గజం ఫైజర్‌ ప్రకటించింది. అయితే మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్‌లలో నిల్వ చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఫైజర్ వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు -70 సెల్షియస్‌ అవసరమంటూ వార్తలు వెలువడిన విషయం విదితమే. దీంతో మోడర్నా ఇంక్‌ వ్యాక్సిన్‌పట్ల పరిశ్రమవర్గాలలో అంచనాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top