79 కోట్ల టన్నుల కార్గో | India major ports handled highest ever cargo at 795 million tonne in FY23 | Sakshi
Sakshi News home page

79 కోట్ల టన్నుల కార్గో

Apr 22 2023 6:41 AM | Updated on Apr 22 2023 6:41 AM

India major ports handled highest ever cargo at 795 million tonne in FY23 - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన నౌకాశ్రయాల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 79.5 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. వాటాల విక్రయం ద్వారా రూ.3,700 కోట్లు సాధించాలన్న లక్ష్యాన్ని మించి రూ.5,000 కోట్ల విలువైన రవాణా లావాదేవీలు జరిగాయని మినిస్ట్రీ ఆఫ్‌ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్‌ సెక్రటరీ సుధాన్‌‡్ష పంత్‌ వెల్లడించారు.

2021–22తో పోలిస్తే సరుకు రవాణా గత ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం అధికంగా జరిగిందని తెలిపారు. పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రి సర్వానంద సోనోవాల్‌ గ్రీన్‌ పోర్ట్‌ మార్గదర్శకాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో ప్రధాన నౌకాశ్రయాల్లో దీనదయాల్‌ (కాండ్లా), ముంబై, మార్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్‌ (కామరాజార్‌), ట్యూటికోరిన్, విశాఖపట్నం, పారదీప్, కోల్‌కత (హాల్దియాతో కలిపి), జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ఉన్నాయి.  

స్వల్పంగా పెరిగిన వాటా..
ప్రధానేతర పోర్టులతో పోలిస్తే చాలా ఏళ్ల తర్వాత మేజర్‌ పోర్టులు అధిక వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయని పంత్‌ తెలిపారు. ‘ప్రధానేతర పోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడతాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఓడరేవులను ప్రైవేట్‌ భాగస్వాములకు లీజుకు ఇచ్చాయి. సరుకు రవాణాలో నాన్‌–మేజర్‌ పోర్టులు 8.5–9 శాతం వృద్ధి చెందాయి. మొత్తం కార్గోలో ప్రధాన పోర్టుల వాటా 54 నుంచి 55 శాతానికి, నాన్‌–మేజర్‌ పోర్టుల వాటా 46 నుంచి 45 శాతానికి వచ్చి చేరింది. ప్రధాన పోర్టులకు 1 శాతం మార్పు కూడా చాలా ముఖ్యమైన విజయం. ఎందుకంటే చాలా సవాళ్లు ఉన్నప్పటికీ ఇవి తమ వాటాను పెంచుకున్నాయి. జలమార్గాల ద్వారా సరుకు రవాణా 16 శాతం ఎగసి 12.6 కోట్ల టన్నులకు చేరింది. ప్రధాన పోర్టులకు వచ్చిన నౌక పని ముగించుకుని వెళ్లేందుకు అయ్యే సమయం 3–4 గంటలు తగ్గింది’ అని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement