పన్ను చెల్లింపుదారుల గుడ్ న్యూస్.. జూన్‌ 7 నుంచి కొత్త వెబ్‌సైట్‌

Income Tax dept to launch new e-portal for easier ITR filing methods - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్నులను మరింత సులభతరం చేయడంతోపాటు, మొబైల్‌ ఫోనులోనూ ఉపయోగించుకునేలా ఈ-ఫైలింగ్‌ 2.0 కొత్త పోర్టల్‌ రానుంది. పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ విభాగం కొత్త పోర్టల్ ఈ-ఫైలింగ్ 2.0ను జూన్ 7న ప్రారంభించనుంది. కొత్త వెబ్‌సైట్ ఇప్పటికే ఉన్న పోర్టల్‌ (incometaxindiaefiling.gov.in) స్థానంలో తీసుకొని రానున్నారు. కొత్త ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్ ప్రారంభించటానికి ముందు, జూన్ 1 నుంచి జూన్ 6 మధ్య ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు  అందుబాటులో ఉండవని పేర్కొంది.

జూన్ 7 నాటికి కొత్త ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్(incometax.gov.in) అమలులోకి వస్తుంది. "ఈ-ఫైలింగ్ 2.0 పోర్టల్" ముఖ్యమైన లక్షణాలను ఐటి విభాగం వివరించింది. మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నులను ఎలా చేయాలో మార్గనిర్దేశకం చేయడానికి యూజర్ మాన్యువల్లు, వీడియోలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా, ఆన్-పోర్టల్ పన్ను చెల్లింపుల కోసం మల్టిపుల్ ఆప్షన్ లు ఉంటాయి. ముందే మీరు ఇచ్చిన వివరాలు ఫిల్ చేసి ఉంటాయి. సురక్షితమెన లాగిన్, చాట్‌బాట్, హెల్ప్‌డెస్క్ సపోర్ట్ వంటివి పోర్టల్‌లోని ముఖ్యమైన లక్షణాలు.

చదవండి: ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే పర్సనల్ లోన్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top