దీర్ఘకాలానికి మంచి రాబడి! | Include Mid-Cap And Small-Cap Funds Alongside Large-Cap Funds In The Portfolio | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలానికి మంచి రాబడి!

Jun 8 2026 8:13 AM | Updated on Jun 8 2026 8:16 AM

Include Mid-Cap And Small-Cap Funds Alongside Large-Cap Funds In The Portfolio

ఎస్‌బీఐ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌

ఈక్విటీల నుంచి మెరుగైన రాబడులను కోరుకునే ఇన్వెస్టర్ట పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు తప్పకుండా చోటు ఉండాలి. రిస్క్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మిడ్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ అదనపు రాబడిని తెచ్చి పెడతాయని చారిత్రిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్‌బీఐ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ కూడా ఒకటి. కనీసం ఏడేళ్లు అంతకుమించిన దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు ఈ ఫండ్‌ను పరిశీలించొచ్చు.

రాబడులు.. 
ఈ పథకం గతంలో ఎస్‌బీఐ మాగ్నం మల్టీప్లయర్‌ ఫండ్‌గా ఉండేది. 1993 నుంచి ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 4.52 శాతం రాబడిని ఇచి్చంది. మూడేళ్లలో చూస్తే వార్షిక రాబడి 15.44 శాతంగా ఉంది. ఐదేళ్లలోనూ 15 శాతం, ఏడేళ్లలో 16.58 శాతం, పదేళ్లలో 15.47 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచి్చపెట్టింది. కానీ, బీఎస్‌ఈ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ సూచీ టీఆర్‌ఐ రాబడి కంటే ఈ పథకమే వివిధ కాలాల్లో 2–4 శాతం అదనపు రాబడిని అందించింది.

ఇక లార్జ్‌అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకం 0.5 శాతం మేర అధిక ప్రతిఫలాన్ని అందించింది. గతంలో లార్జ్‌క్యాప్‌ ఫండ్‌గా కొనసాగింది. ఇప్పుడు లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ మిశ్రమంగా పెట్టుబడులు చేస్తుంది. కనుక మెరుగైన ప్రతిఫలాన్ని ఈ పథకం నుంచి దీర్ఘకాలానికి ఆశించొచ్చు. డైరెక్ట్‌ ప్లాన్‌ ఎన్‌ఏవీ 0.64 శాతంగా ఉంది. ఏక మొత్తంలో అయితే కనీసం రూ.1,000, సిప్‌ రూపంలో అయితే కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.


పెట్టుబడుల విధానం.. 
ఈ పథకం భిన్న రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. వృద్ధి, వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ ఈ పథకంలో భాగంగా ఉండడం మరో ఆకర్షణీయ అంశం. భారీ వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అదే సమయంలో ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడ్‌ అవుతున్న, వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్న స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంది. టాప్‌ డౌన్, బోటమ్‌ అప్‌ రెండు విధానాల కింద స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియో పీఈ 25.61గా ఉండడం అన్నది గ్రోత్‌ ఆధారిత పోర్ట్‌ఫోలియోను సూచిస్తోంది. గత మూడేళ్లలో మార్కెట్ల నష్టాల సమయాల్లో ఎన్‌ఏవీ క్షీణతను పరిమితం చేసింది.

పోర్ట్‌ఫోలియో.. 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.38,426 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.94 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, 0.74 శాతం పెట్టుబడులు డెట్‌ సెక్యూరిటీలకు కేటాయించింది. నగదు నిల్వలు 5.32 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 41.66 శాతం లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, 43.32 శాతం మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో, 15 శాతం స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయించింది. రంగాల వారీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 21.38 శాతం కేటాయించింది. ఆ తర్వాత మెటీరియల్స్‌ కంపెనీల్లో 13.81 శాతం, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో 12.62 శాతం, ఇండస్ట్రియల్‌ కంపెనీల్లో 12.15 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement