IIIT Lucknow Student Bags Rs 1.2 Crore Package To Work For Amazon - Sakshi
Sakshi News home page

Abhijeet Dwivedi: రూ.1.2 కోట్ల జాక్‌పాట్‌..! ట్రిపుల్ఐటీ చరిత్రలోనే రికార్డు సృష్టించిన విద్యార్థి..!

Published Sat, Apr 9 2022 9:19 PM | Last Updated on Sun, Apr 10 2022 12:56 PM

Iiit Lucknow Student Abhijeet Dwivedi Bags Rs 1 2 Crore Package to Work for Amazon - Sakshi

రూ. 1.2 కోట్ల జాక్‌పాట్‌..! ట్రిపుల్ఐటీ చరిత్రలోనే రికార్డు సృష్టించిన విద్యార్థి..!

లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ)కు చెందిన  అభిజీత్‌ ద్వివేది అనే విద్యార్థి తన ప్రతిభతో అమెజాన్‌ సంస్థలో అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీను పొంది రికార్డు సృష్టించాడు. అమెజాన్‌ అతడికి సుమారు  రూ. 1.2 కోట్లను ప్యాకేజ్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. 

ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో అమెజాన్‌కు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా అభిజీత్ ద్వివేది నియమితులయ్యారు.  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న అభిజీత్...తన అద్భుతమైన ప్రతిభతో వార్షిక ప్యాకేజీతో మునుపటి ప్లేస్‌మెంట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. కోవిడ్‌-19 ఉదృతి కాస్త తగ్గడంతో ఐఐఐటీ ల‌క్నో విద్యార్ధులు అత్య‌ధిక ప్యాకేజ్‌ల‌తో 100 శాతం ప్లేస్‌మెంట్ సాధించారు. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ లక్నో రికార్డులను క్రియేట్‌ చేసింది.

​గత సంవత్సరాలతో పోలిస్తే... ఈ ఏడాది క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ ల‌క్నో వార్షిక స‌గ‌టు వేత‌నం రూ 26 ల‌క్ష‌లుగా ఉందని ట్రిపుల్‌ ఐటీ డైరక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌ మోహన్‌ షేర్రీ వెల్లడించారు. 

చదవండి: అమెజాన్‌ బంపరాఫర్‌, ఉచితంగా 500కోర్సులు..అస్సలు మిస్సవ్వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement