అంబేడ్కర్‌ యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ లీగ్‌.. స్టార్లప్‌లకు కొత్త వరం

IFCI Introduce Ambedkar Young Entrepreneurs Fund To Support Startups Established By SC and BCs - Sakshi

యువ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఫండ్‌ 

షెడ్యూల్డ్‌ కులాలకు మద్దతుగా ప్రత్యేక పథకం 

ఐఎఫ్‌సీఐ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ ప్రణాళికలు  

న్యూఢిల్లీ: షెడ్యూల్డ్‌ కులాల విభాగంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతిచ్చేందుకు ఐఎఫ్‌సీఐ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. అంబేడ్కర్‌ యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ లీగ్‌ పేరుతో త్వరలో తొలి దశను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ ఎస్‌.తోమర్‌ పేర్కొన్నారు. తద్వారా బిజినెస్‌ ఐడియాలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నట్లు తెలియజేశారు. ఐఎఫ్‌సీఐ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థే ఐఎఫ్‌సీఐ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌. సంస్థ ప్రస్తుతం ఐదు వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. వీటిలో రెండింటిని సామాజికంగా వెనుకబాటు, వెనుకబడిన కులాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు మద్దతిచ్చేందుకు వినియోగిస్తోంది. 

2020లో తొలుత షెడ్యూల్డ్‌ కులాల(ఎస్‌సీలు)కు చెందిన 1,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో మిషన్‌ను ప్రారంభించింది. తద్వారా అంబేడ్కర్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌క్యుబేషన్‌ మిషన్‌ పేరుతో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తూ ఎస్‌సీల కోసం ఫండ్‌ను ఏర్పాటు చేసిననట్లు ఈ సందర్భంగా తోమర్‌ తెలియజేశారు.
 

చదవండి: నవ్విస్తూ.. నేర్పిస్తూ.. ఇంటింటికి చేరువై.. లక్షల కోట్లకు అధిపతిగా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top