కార్యాలయాలకు కేరాఫ్‌ హైదరాబాద్‌! ఆఫీస్‌ స్పేస్‌ లీజుల్లో టాప్‌

hyderabad tops in large office spaces transactions - Sakshi

పెద్ద కార్యాలయాలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా నిలిచింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్‌ల లావాదేవీల జాబితాలో హైదరాబాద్, పుణె, బెంగళూరు నగరాలు టాప్‌లో ఉన్నాయి.

ఇదీ చదవండి: కరూర్‌ వైశ్యా బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా! రూ.30 లక్షల జరిమానా..

మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో 1 లక్ష చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో లావాదేవీలు హైదరాబాద్, పుణేలలో 53 శాతం జరిగాయి. బెంగళూరులో ఈ లావాదేవీలు 51 శాతంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ఇక 50వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్‌ల లావాదేవీలు కోల్‌కతాలో 70 శాతం, చెన్నైలో 57 శాతం జరిగాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబైలలో 50వేల నుంచి 1 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలకు ఈ విభాగంలో 30 శాతానికి పైగా లావాదేవీలు జరిగాయి.

ఇదీ చదవండి: ధూమ్‌మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది!

2022లో ఆఫీస్ లీజింగ్ పరిమాణం 51 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్‌ లావాదేవీలు 2023లో మరింత ఊపందుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు సంబంధించి బెంగళూరులో 36 ఒప్పందాలు, హైదరాబాద్‌లో 15 డీల్స్‌, పుణెలో 13  ఒప్పందాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ఈ నగరాల్లోని ఐటీ, తయారీ కంపెనీలు పెద్ద పరిమాణ కార్యాలయాలకు డిమాండ్‌ను పెంచాయని వివరించింది.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top