ధూమ్‌మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది!

Hero Karizma likely to comeback with powerful 210cc engine - Sakshi

హీరో కరిజ్మా బైక్‌ మళ్లీ వస్తోంది. ఒకప్పుడు బాగా పాపులర్‌ అయిన పాత బైక్‌లన్నీ ఇప్పుడు సరికొత్త హంగులు, ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి వస్తున్నాయి. గత నెలలో బజాజ్ తన సక్సెస్ ఫుల్ బైక్ పల్సర్ ని మళ్లీ మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హీరో మోటోకార్ప్ కూడా ఒకప్పుడు బాగా ఆదరణ పొందిన కరిజ్మా బైక్‌ను తిరిగి ప్రవేశ పెట్టనుంది.

ఇదీ చదవండి: వరల్డ్‌ బ్యాంక్‌ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్‌.. భారత్‌లో సమావేశాలన్నీ రద్దు! 

హీరో కరిజ్మా బైక్‌ దాని స్పోర్టీ లుక్స్, పెర్ఫార్మెన్స్‌తో లాంచ్ అయిన వెంటనే భారత మార్కెట్లో బాగా పాపులర్ అయింది. ఆ సమయంలో హీరో కరిజ్మా అత్యంత ఆకర్షణీయమైన మోటార్‌సైకిళ్లలో ఒకటి. హీరో కరిజ్మా ఆర్‌, హీరో కరిజ్మా ZMR విక్రయాలు అప్పట్లో భారీగా జరిగాయి. ఆ తర్వాత ఆ బైక్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపేసింది.

చాలా బైక్‌ తయారీ సంస్థలు ఇటీవల పాత మోడళ్లను పునరుద్ధరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరిజ్మా బైక్‌ను కొత్త హంగులతో తిరిగి తీసుకొచ్చేందుకు హీరో సంస్థ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో కరిజ్మా 2023 కొత్త డిజైన్‌, శక్తివంతమైన ఇంజన్ ప్రస్తుతం తయారీలో ఉన్నట్లు రష్‌లేన్ నివేదించింది. కరిజ్మా 2023 టెస్ట్ మ్యూల్ చిత్రాలను కూడా షేర్ చేసింది.

అత్యంత ఆదరణ పొందిన ఏ బైక్‌ అయినా సరే ఆ కంపెనీకి మంచి గుర్తింపుని తీసుకువస్తుంది. అలానే ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో హీరో మోటోకార్ప్ తీసుకువచ్చిన కరిజ్మా బైక్ చాలా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఈ బైక్ పై వెళ్తున్న సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. అంత ఆదరణ పొందిన ఈ మోడల్ బైక్ ని సరికొత్త లుక్‌ రీలాంచ్ చేయనుంది హీరోమోటోకార్ప్‌.

2014లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో OG కరిజ్మా R, కరిజ్మా ZMR సిరీస్ బైక్స్ ని హీరో తీసుకువచ్చింది. ఇప్పుడిదే కొత్త లిక్విడ్ కూల్డ్ 210సీసీ ఇంజన్‌తో వస్తోంది. ఈ సెగ్మెంట్ లో పల్సర్ వంటి అధునాతన బైక్స్‌కి ఈ సరికొత్త కరిజ్మా గట్టి పోటీ ఇవ్వనుంది.

ఫేస్‌లిఫ్టెడ్ మోడలన్నీ EBR (ఎరిక్ బుల్ రేసింగ్)తో తయారు చేస్తారు. కరిజ్మా మోడల్‌ని నిలిపివేసిన తర్వాత హీరో ఎక్స్‌ట్రీమ్‌ (Xtreme 200S) బైక్ ని లాంచ్‌ చేసింది. అయితే కరిజ్మా స్థానంలో తీసుకువచ్చిన ఈ బైక్ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో వాటిని కూడా హీరో సంస్థ నిలిపివేసింది.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top