సరిలేరు మీకెవ్వరూ!! ధనవంతులకు కేరాఫ్‌ అడ్రస్‌ హైదరాబాద్‌! | Hyderabad Got Ranks Second Position In Knight Frank Wealth Report | Sakshi
Sakshi News home page

సరిలేరు మీకెవ్వరూ!! ధనవంతులకు కేరాఫ్‌ అడ్రస్‌ హైదరాబాద్‌!

Mar 2 2022 3:22 PM | Updated on Mar 2 2022 4:38 PM

Hyderabad Got Ranks Second Position In Knight Frank Wealth Report - Sakshi

నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌లో హైదరాబాద్‌ సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.  రూ.225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తుల ఉన్న వ్యక్తుల ఆధారంగా దేశంలో ఎంత మంది ధనికులు ఉన్నారనే అంశంపై నైట్‌ ఫ్రాంక్‌ ఓ నివేదికను తయారు చేసింది. ఆల్ట్రా హై నెట్‌ వర్త్‌ ఇండివ్యూజివల్స్‌-2021 పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో ధనికుల జాబితాలో హైదరాబాద్‌ రెండో​ స్థానాన్ని కైవసం చేసుకుంది. 

నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌లో హైదరాబాద్‌ లో 467 మంది వ్యక్తులు రూ.225 కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. 2026 సంవత్సరానికి ఆ వ్యక్తుల జాబితా 56శాతం వృద్దితో 728కి చేరనున్నట్లు హైలెట్‌ చేసింది. ఇక  ముంబై 1596 మంది ధనికులతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పూణేలు ఉన్నాయి. 

ఈ సందర్భంగా నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చీఫ్‌ ఎకనామిస్ట్‌ రజనీ సిన్హా మాట్లాడుతూ..హైదరాబాద్‌ టెక్నాలజీ తో పాటు, డిజిటల్‌ ఎకానమీ తోడ్పాటు  కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2016 నుంచిలో 28.4 నుంచి అనూహ్యంగా 39శాతం వృద్దితో  ధనవంతుల జాబితా పెరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా 2021లో ఐటీ,ఫార్మాసిట్యూకల్స్‌, బయోటెక్నాలజీ వంటి వ్యాపార రంగాల్లో హైదరాబాద్‌ కీ రోల్‌ ప్లే చేస్తుందని, కాబట్టి అనేక మంది ఆర్ధికంగా ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులతో పోటీ పడుతున్నారని రజనీ సిన్హా అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి: భార‌త్‌కు బైబై!! స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement