Bollywood Actor Huma Qureshi Buys Mercedes-Benz GLS 400d - Sakshi
Sakshi News home page

బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు.. ఇదే: ధర ఎంతంటే?

Mar 7 2023 3:17 PM | Updated on Mar 7 2023 3:46 PM

Huma qureshi new mercedes benz details - Sakshi

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' ఇటీవల ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ (Mercedes Benz GLS 400d) మోడల్‌ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హ్యుమా ఖురేషి కొన్న ఈ కారు ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0 లీటర్ సిక్స్ సిలీండర్ డీజిల్ ఇంజిన్‌ కలిగి 325 బీహెచ్‌పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరు కారు కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది, అదే సమయంలో దీని టాప్ స్పీడ్ గంటకు 238 కిలోమీటర్లు.

మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ మోడల్ మల్టీ బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎలక్ట్రల్లీ అడ్జస్టబుల్ వెంటిలేటెర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, 12 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి వాటిని పొందుతుంది.

(ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నన్ను ఎందుకు తొలగించారన్న ఉద్యోగి.. ఎలాన్ మస్క్ రీప్లే ఇలా)

వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్న హ్యుమా ఖురేషి ఎప్పటికప్పుడు తన గ్యారేజిని ఆధునిక కార్లతో అప్డేట్ చేసుకుంటూనే ఉంటుంది. ఈమె మొదటి కారు మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ కావడం గమనార్హం. ఆ తరువాత ల్యాండ్ రోవర్‌ ఫ్రీ ల్యాండర్‌, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 250డీ వంటి వాటిని కొనుగోలు చేసింది. తాజాగా ఇప్పుడు మరో లగ్జరీ కారుని తన గ్యారేజిలో చేర్చింది.

Advertisement
 
Advertisement
Advertisement