
మానవ నిర్మితమైన 'పనామా కాలువ' (Panama Canal) పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ ఉత్తర, దక్షిణ అమెరికాలు విడదీస్తుంది. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణించే దూరం ఏకంగా 9500 కిమీ తగ్గిపోయింది.
సాధారణంగా సముద్రం మీద వెళ్లినట్లు ఈ కాలువలో షిప్పులు ప్రయాణించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ భూభాగం ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ఇది అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని లాకింగ్ సిస్టం అనే పద్దతి ద్వారా షిప్పులను జాగ్రత్తగా ఒకవైపు నుంచి మరో వైపుకు పంపడం చూడవచ్చు.
పనామా కాలువలో షిప్పులు ఎలా ముందుకు వెళతాయి అనేదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్టేట్ నుంచి మరో స్టేజికి వెళ్లాలంటే లాకింగ్ పద్దతిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నీటిని ఓకే సమతుల్య స్థానానికి తీసుకు వచ్చిన తరువాత ఇవి ముందుకు కదులుతాయి. ఇలా లాకింగ్ పద్దతిని అనుసరించి అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ సముద్రంలోకి షిప్పులు కదులుతాయి.
How ships cross the Panama Canal.. ❤️pic.twitter.com/G5GeuBxK92
— #NaMo Again 🚩 (@BhaktSanatani_) February 29, 2024