చైనా మార్కెట్ కోసం హోండా.. ముచ్చటగా మూడు

Honda retro electric scooters for chaina - Sakshi

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా' చైనీస్ మార్కెట్ కోసం మూడు ఎలక్ట్రిక్ రెట్రో స్కూటర్లను పరిచయం చేసింది.  ఈ మూడు స్కూటర్లు సింపుల్ డిజైన్ కలిగి మినిబైకుల మాదిరిగా ఉన్నాయి. ఇవి గతంలో పెట్రోల్ బేస్డ్ మోడల్స్‌గా అందుబాటులో ఉండేవి. 

చైనా కోసం రూపొందిన 'కబ్ ఈ (Cub e), డాక్స్ ఈ (Dax e) జూమర్ ఈ (Zoomer e)' ఎలక్ట్రిక్ స్కూటర్లు గతంలో ఎక్కువగా అమ్ముడైన పాపులర్ టూవీలర్స్. ఇవి 1958 నుంచి 2018 వరకు నిరంతరం సిరీస్‌లో భాగంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.

హోండా కబ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్‌తో 64 కిమీ రేంజ్, డాక్స్ ఈ 80 కిలోమీటర్లు, జూమర్ ఇ సుమారు 90కి.మీ రేంజ్ అందిస్తుంది. కబ్ ఇ అనేది హోండా కబ్ ఆధారంగా రూపొందించబడింది. ఆ తరువాత ఆధునిక అప్డేట్స్ పొందింది. డాక్స్ ఈ దాని దాని మునుపటి మోడల్స్ ఆధారంగా రూపుదిద్దుకుంది.

జూమర్ ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ రక్కస్ స్కూటర్ ప్రేరణ పొందింది. ఇది (రక్కస్) 49 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉండేది. అయితే కంపెనీ ఇప్పుడు పరిచయం చేసిన మూడు మోడల్స్ పెట్రోల్ వెర్షన్స్ కాదు, ఇవి పూర్తిగా ఎలక్టిక్ మోపెడ్ స్కూటర్లు. ఇవి చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తాయి.

కొత్త హోండా ఎలక్ట్రిక్ మోపెడ్‌ స్కూటర్లలో ఛార్జింగ్ అయిపోతే పెడల్ సహాయంతో సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. ఈ స్కూటర్ల యొక్క గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఇవి కేవలం చైనీస్ మార్కెట్లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇతర దేశాల్లో విక్రయించే అవకాశం లేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top