హోండా కంపెనీ భారీ ప్లాన్.. ఇక తగ్గేదె లే!

Honda plans to launch 10 EVs in next 5 years - Sakshi

ఎలక్ట్రిక్ మార్కెట్లో రోజు రోజుకి కంపెనీల మధ్య పోటీ వేడెక్కిపోతుంది. రాబోతున్నది ఎలక్ట్రిక్ ప్రపంచం అని తెలుసుకొని భారీగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో హోండా తన ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది. జపనీస్ ఆటోమేకర్ ఇటీవల చైనా ఆటో మార్కెట్లో నిలబడటం కోసం రాబోయే ఐదేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ మోడల్స్ ను ఇతర మార్కెట్లోకి ఎప్పడూ తీసుకువస్తారు అనేది పేర్కొనలేదు.

చైనీస్ ఆటోమొబైల్ మార్కెట్లో హోండా తన ఎలక్ట్రిక్ వాహనాలను కొత్త ఈ-ఎన్ సిరీస్ పేరుతో కార్లను తీసుకొని రావాలని ఆలోచిస్తుంది. ఈ-ఎన్ సిరీస్ లో మొదటి రెండు మోడల్స్ ఈ-ఎన్ఎస్1, ఈ-ఎన్ పి1 పేరుతో పిలుస్తారు. ఈ కార్లను 2022 వసంతకాలంలో చైనా ఆటో మార్కెట్లో ప్రారంభించాలని భావిస్తున్నారు. డాంగ్ ఫెంగ్ హోండా, జీఎసీ హోండా మధ్య జాయింట్ వెంచర్లో కార్ల తయారీదారు హెచ్ ఆర్-వి శ్రేణి కింద కార్ల తయారీ ప్రారంభించారు. అయితే, భారతదేశంలో ఎప్పుడు తీసుకొస్తారు అనే విషయంలో స్పష్టత లేదు. హోండా ప్రత్యర్థి టాటా మోటార్స్ ఈవీ కార్లతో భారతదేశంలో తుఫాను సృష్టించేందుకు 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని యోచిస్తోంది.

(చదవండి: సరికొత్త ఆఫర్‌...మనీ యాడ్‌ చేస్తే...20 శాతం బోనస్‌..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top