పలు కార్లపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన హోండా..!

పండుగల సీజన్ దగ్గరలో ఉండడంతో కొత్త కస్టమర్లను ఆకర్షించడం కోసం పలు కార్ల తయారీ కంపెనీలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ హోండా కార్ల అమ్మకాలు పెంచేందుకుగాను పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పలు మోడల్ కార్లపై సుమారు రూ. 57 వేల వరకు డిస్కౌంట్లను హోండా తన కస్టమర్లకు అందించనుంది. హోండా అమేజ్, జాజ్, ఆల్-న్యూ సిటీ సెడాన్, డబ్ల్యూఆర్‌వీ మోడల్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని హోండా ఒక ప్రకటనలో పేర్కొంది.
చదవండి: Honda U Go Electric Scooter: హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా?
హోండా అమేజ్ మోడల్ కొనుగోలుపై సుమారు గరిష్టంగా రూ. 57, 044 తగ్గింపును ప్రకటించింది. అమేజ్ 2021 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై గరిష్టంగా రూ.18,000 వరకు ప్రయోజనాలను అందించనుంది. ఇందులో లాయల్టీ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వరుసగా రూ. 5,000, రూ. 9,000, రూ. 4,000గా ఉన్నాయి.
హోండా జాజ్ మోడల్ పై సుమారు రూ.39.947 డిస్కౌంట్‌తో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. హోండా డబ్ల్యూఆర్‌శీ మోడల్‌పై సుమారు రూ. 39, 998 డిస్కౌంట్‌ను అందించనుంది. అంతేకాకుండా కార్ ఎక్స్‌చేంజ్‌పై సుమారు పదివేల వరకు తగ్గింపును హోండా తన కస్టమర్లకు అందించనుంది.
ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ సెడాన్ మోడళ్లపై సుమారు రూ. 37,708 తగ్గింపును ఇవ్వనుంది. కొనుగోలుదారులు కారు ఎక్స్‌చేంజ్‌పై సుమారు రూ. 5,000 విలువైన డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ కార్లపై హోండా లాయల్టీ బోనస్, కార్ ఎక్స్‌చేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్ రూపంలో ఆయా మోడళ్లపై హోండా డిస్కౌంట్లను అందించనుంది.