నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ | Sakshi
Sakshi News home page

నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌

Published Thu, Dec 31 2020 1:43 PM

Home broadband connections under Rs 500 monthly plan - Sakshi

ముంబై, సాక్షి: నెలకు రూ. 500 లోపు ఖర్చులో నెట్‌ కనెక్షన్‌ తీసుకుందామనుకునే వినియోగదారులకు శుభవార్త. పలు కంపెనీలు రూ. 500లోపు అద్దెలో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జాబితాలో ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోతోపాటు.. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎగ్జైటెల్‌ చేరాయి. పలు ఆఫర్లు రూ. 399తోనే ప్రారంభంకానున్నాయి. చదవండి: (బంగారు హెడ్‌ఫోన్స్‌ @ రూ. 80 లక్షలు)

పలు ఆఫర్లు
ఈ ఏడాది(2020) టెలికం కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులకు సంబంధించి పలు ఆఫర్లు ప్రకటించాయి. పీఎస్‌యూ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రమోషనల్‌ సమయంలో డేటా పెంచడం వంటి ఆఫర్లు ప్రకటించగా.. జియో ఫైబర్‌ రూ. 399 నుంచి ప్రారంభమయ్యే సర్వీసులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సౌకర్యాన్ని సమకూర్చింది. ఇక ఎగ్జైటెల్‌ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో డేటా పరిమితిలేని ప్యాకేజీలు ప్రకటించింది. నెలకు రూ. 500లోపు చెల్లించే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్ల వివరాలివి.. 

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్‌: నెలకు రూ. 499 ధరలో అన్‌లిమిటెడ్‌ బ్రాండ్‌బ్యాండ్‌ ప్లాన్‌ ఇది. 40 ఎంబీపీఎస్‌ స్పీడ్‌వరకూ లభించే ఈ ప్లాన్‌లో భాగంగా పరిమితిలేని ఇంటర్నెట్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌కు సబ్‌స్క్రిన్సన్‌, వింక్‌ మ్యూజిక్‌, షా అకాడమీ తదితర సౌకర్యాలు సైతం లభిస్తున్నాయి. ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ద్వారా వూట్‌ బేసిక్‌, ఈరోస్‌ నౌ, హాంగామా ప్లే, షెమారూ ఎం, అల్ట్రాను పొందవచ్చు.  చదవండి: (హీరో ఈసైకిల్‌@ 49,000)

బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత్‌ ఫైబర్‌: 100 జీబీ సీయూఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను రూ. 499 ధరలో అందిస్తోంది. నెలకు 100 జీబీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. నెలవారీ జీబీ తదుపరి 50 ఎంబీపీఎస్‌ బ్యాండ్‌విడ్త్‌లో 2 ఎంబీపీఎస్‌కు స్పీడ్ తగ్గనుంది.

జియోఫైబర్‌ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్‌‌: ఈ పథకంలో భాగంగా 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. ఈ పథకంలో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లనూ కంపెనీ ఆఫర్‌ చేయడంలేదు. అయితే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఎగ్జైటెల్‌ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్‌‌: ఈ పథకంలో భాగంగా వినియోగదారులు ఏడాది కాలానికి సబ్‌స్ర్కయిబ్‌ చేస్తే.. 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. ఇందుకు ఒకేసారి రూ. 4,788ను చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్స్‌లో భాగంగా (నెలకు రూ. 449 అద్దె) ఏడాదికి రూ. 5,388, లేదా (రూ. 499 అద్దె) రూ. 5,988 ఒకేసారి చెల్లిస్తే 200 ఎంబీపీఎస్‌ లేదా 300ఎంబీపీఎస్‌ స్సీడ్‌తో సర్వీసులు అందించనుంది. ఇలా కాకుండా 9 నెలలకే కావాలనుకుంటే 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రూ. 424 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. ఇదే ఆఫర్‌లో 6 నెలల కోసం రూ. 490 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. 

Advertisement
 
Advertisement