breaking news
Home broadband
-
2జీ నుంచి ఏఐ వరకు జియోకు వృద్ధి అవకాశాలెన్నో..
న్యూఢిల్లీ: ఈనెల 21 నుంచి ఐపీఓకు సిద్ధమవుతున్న జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్) భవిష్యత్ వృద్ధికి 5జీ, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, కృత్రిమ మేధ (ఏఐ) కీలక చోదక శక్తులుగా నిలవనున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థలు జీఈపీఎల్ క్యాపిటల్, వెంచురా సెక్యూరిటీస్, ఎస్ఎంసీ గ్లోబల్ నివేదికల ప్రకారం దేశంలో ఇంకా సుమారు 26 కోట్ల మంది 2జీ వినియోగదారులు ఆధునిక, హైస్పీడ్ నెట్‌వర్క్‌లకు మారాల్సి ఉంది. వీరిని 4జీ, 5జీ సేవల్లోకి తీసుకురావడం ద్వారా టెలికాం కంపెనీలకు ముఖ్యంగా జియోకు కొత్త వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు దేశంలో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తి ప్రస్తుత 21 శాతం నుంచి 2030 నాటికి 46 శాతానికి చేరవచ్చని అంచనా.దీంతో ఫైబర్ ఇంటర్నెట్, జియో ఎయిర్ ఫైబర్ వంటి సేవల విస్తరణకు అవకాశాలు పెరగనున్నాయి. జియో ఇప్పటికే భారీ వినియోగదారులను కలిగి ఉండడంతో పాటు, డిజిటల్ సేవలు, ఏఐ ఆధారిత ఉత్పత్తుల ద్వారా కొత్త ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. జియో అభివృద్ధిచేసిన దేశీయ ఏఐ ప్లాట్ ఫామ్ కూడా దీర్ఘకాల వృద్ధికి తోడ్పడవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. జియోను కేవలం టెలికాం సేవల సంస్థగా కాకుండా సొంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా కూడా బ్రోకరేజీ సంస్థలు విశ్లేషిస్తున్నాయి.జియో సొంతంగా ఎండ్ టు ఎండ్ 5జీ స్టాండలోన్ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేసిందని వెంచురా సెక్యూరిటీస్ తెలిపింది. 4జీ, 5జీ,6జీ ఏఐ డిజిటల్ టెక్నాలజీలకు సంబంధించి 7,220 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసిందని పేర్కొంది. జియో బ్రెయిన్ పేరుతో అభివృద్ధి చేసిన సొంత ఏఐ ప్లాట్‌ఫామ్‌ను నెట్వర్క్ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నట్లు వివరించింది. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే వ్యూహంలో ఇది కీలక భాగమని అభిప్రాయపడింది. టెలికాం సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సంస్థలకు అందించే డిజిటల్ పరిష్కారాలు ఒకదానితో మరొకటి అనుసంధానమవుతున్న నేపథ్యంలో జియో సొంత ప్లాట్‌ఫామ్‌లు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించగలవని ఎస్ఎంసీ గ్లోబల్ పేర్కొంది. ఆటోమేషన్ పెరగడం ద్వారా నిర్వహణ సామర్ధ్యం మెరుగుపడడంతో పాటు, వినియోగదారులను దీర్ఘకాలం కొనసాగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. జియో ఐపీఓకు సబ్‌స్రై్కబ్ రేటింగ్ ఇచి్చన వెంచురా సెక్యూరిటీస్ ఈ సాంకేతిక సామర్థ్యాన్ని కీలక అంశంగా పరిగణించింది. -
నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్
ముంబై, సాక్షి: నెలకు రూ. 500 లోపు ఖర్చులో నెట్ కనెక్షన్ తీసుకుందామనుకునే వినియోగదారులకు శుభవార్త. పలు కంపెనీలు రూ. 500లోపు అద్దెలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జాబితాలో ఎయిర్టెల్, రిలయన్స్ జియోతోపాటు.. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎగ్జైటెల్ చేరాయి. పలు ఆఫర్లు రూ. 399తోనే ప్రారంభంకానున్నాయి. చదవండి: (బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు) పలు ఆఫర్లు ఈ ఏడాది(2020) టెలికం కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించి పలు ఆఫర్లు ప్రకటించాయి. పీఎస్‌యూ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రమోషనల్ సమయంలో డేటా పెంచడం వంటి ఆఫర్లు ప్రకటించగా.. జియో ఫైబర్ రూ. 399 నుంచి ప్రారంభమయ్యే సర్వీసులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని సమకూర్చింది. ఇక ఎగ్జైటెల్ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో డేటా పరిమితిలేని ప్యాకేజీలు ప్రకటించింది. నెలకు రూ. 500లోపు చెల్లించే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల వివరాలివి.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్: నెలకు రూ. 499 ధరలో అన్లిమిటెడ్ బ్రాండ్‌బ్యాండ్ ప్లాన్ ఇది. 40 ఎంబీపీఎస్ స్పీడ్వరకూ లభించే ఈ ప్లాన్‌లో భాగంగా పరిమితిలేని ఇంటర్నెట్ను అందిస్తోంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్కు సబ్స్క్రిన్సన్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ తదితర సౌకర్యాలు సైతం లభిస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా వూట్ బేసిక్, ఈరోస్ నౌ, హాంగామా ప్లే, షెమారూ ఎం, అల్ట్రాను పొందవచ్చు. చదవండి: (హీరో ఈసైకిల్@ 49,000) బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్: 100 జీబీ సీయూఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ. 499 ధరలో అందిస్తోంది. నెలకు 100 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. నెలవారీ జీబీ తదుపరి 50 ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్‌లో 2 ఎంబీపీఎస్‌కు స్పీడ్ తగ్గనుంది. జియోఫైబర్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ పథకంలో ఎలాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్లనూ కంపెనీ ఆఫర్ చేయడంలేదు. అయితే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎగ్జైటెల్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా వినియోగదారులు ఏడాది కాలానికి సబ్‌స్ర్కయిబ్ చేస్తే.. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఇందుకు ఒకేసారి రూ. 4,788ను చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్‌లో భాగంగా (నెలకు రూ. 449 అద్దె) ఏడాదికి రూ. 5,388, లేదా (రూ. 499 అద్దె) రూ. 5,988 ఒకేసారి చెల్లిస్తే 200 ఎంబీపీఎస్ లేదా 300ఎంబీపీఎస్ స్సీడ్‌తో సర్వీసులు అందించనుంది. ఇలా కాకుండా 9 నెలలకే కావాలనుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 424 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. ఇదే ఆఫర్లో 6 నెలల కోసం రూ. 490 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. -
బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ ఫోకస్..
కొత్త కస్టమర్లకు 30 శాతం వరకు తగ్గింపు - పాత కస్టమర్లకు అదనపు డేటా, అధిక స్పీడ్ - ఎయిర్టెల్ సర్కిల్ సీఈవో వెంకటేష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఎయిర్టెల్ ఇప్పుడు హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఫోకస్ చేసింది. భారత్‌లో ఈ విభాగం ఏటా 15-20 శాతం వృద్ధి చెందుతుండడంతో కంపెనీ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. కొత్త కస్టమర్లకు హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ధర 30 శాతం వరకు తగ్గించింది. అలాగే ఎయిర్టెల్ సర్ప్రైసెస్ పేరుతో పాత కస్టమర్లకు ప్లాన్ ధరలో మార్పు లేకుండా అధిక స్పీడ్, డేటాను అందిస్తోంది. సర్ప్రైసెస్లో కస్టమర్లు అధిక స్పీడ్ లేదా అదనపు డేటాను ఎంచుకోవచ్చు. స్పీడ్ విషయానికి వస్తే వ్యక్తిగత బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు 16 ఎంబీపీఎస్ వరకు ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఎయిర్టెల్ ఈ ఆఫర్లను సోమవారం ప్రకటించింది. మొబైల్‌తోపాటు బ్రాడ్‌బ్యాండ్.. మొబైల్లో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య భారత్‌లో సుమారు 21 కోట్లుంది. వీరిలో 20 శాతం మంది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సైతం తీసుకున్నట్టు అంచనా. పోస్ట్ పెయిడ్ మొబైల్ వినియోగదార్లలో 70 శాతం మందికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉంది. ఇంతటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈ విభాగంపై దృష్టిపెట్టామని ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్‌రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లకు మరింత చేరువ య్యేందుకే ఇంటర్నెట్ స్పీడ్ పెంచామని, చార్జీలను తగ్గించామన్నారు. దేశంలో హైదరాబాద్‌లోనే బ్రాడ్‌బ్యాండ్ చార్జీలు తక్కువని చెప్పారు. భారత్‌లో సగటున ఒక్కో కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్‌కు నెలకు సుమారు రూ.850-900 చెల్లిస్తున్నారని ఆయన వివరించారు. అపార్ట్మెంట్లకు 100 ఎంబీపీఎస్.. ఫైబర్ టు హోమ్ సేవలను ఎయిర్టెల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో హైటెక్ సిటీ వద్ద ప్రారంభించింది. ప్రస్తుతం నాలుగు భారీ అపార్ట్మెంట్లకు కనెక్షన్ ఇచ్చింది. కస్టమర్లు 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ పొందుతారు. నెలవారీ రెంటల్ రూ.2,499 నుంచి ప్రారంభం. ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు తమ ల్యాండ్‌లైన్ నుంచి సూపర్ సేవర్ వాయిస్ ప్యాక్స్ ద్వారా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. లోకల్ కాల్స్ కోసం నెలకు రూ.49, లోకల్, ఎస్టీడీ కాల్స్ కోసం రూ.99 చెల్లించాలి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా 10 కోట్లు ఉన్నాయి.


