హీరో లాభం రూ.721 కోట్లు | Sakshi
Sakshi News home page

హీరో లాభం రూ.721 కోట్లు

Published Thu, Feb 9 2023 6:40 AM

Hero MotoCorp Net Profit Rises 2percent To Rs 721 Crore - Sakshi

న్యూఢిల్లీ: హీరో మోటో కార్ప్‌ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.721 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభంతో పోలిస్తే 2.41 శాతం పెరిగింది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.8,118 కోట్లుగా ఉంది. 12.40 లక్షల యూనిట్ల మోటారు సైకిళ్లను విక్రయించినట్టు సంస్థ ప్రకటించింది.

వ్యయాలు రూ.7,217 కోట్ల నుంచి రూ.7,373 కోట్లకు చేరాయి. ‘‘మా మార్కెట్‌ వాటా కాస్తంత కోలుకుంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో ముఖ్యంగా ప్రీమియం విభాగంలో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో మార్కెట్‌ వాటా పెంచుకుంటామని అంచనా వేస్తున్నాం’’అని హీరో మోటోకార్ప్‌ సీఎఫ్‌వో నిరంజన్‌ గుప్తా తెలిపారు. తమ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం ‘విదా’ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పలు పట్టణాలకు చేరువ చేస్తామన్నారు.   

Advertisement
 
Advertisement