Hero Electric: ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసే వారికి హీరోఎలక్ట్రిక్‌ గుడ్‌న్యూస్‌..! మరింత సులువుగా..!

Hero Electric Ties Up With Axis Bank To Offer Retail Financing Solutions - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎలక్ట్రిక్‌​ స్కూటర్లను సొంతం చేసుకునే కస్టమర్ల కోసం యాక్సిస్‌బ్యాంక్‌తో హీరోఎలక్ట్రిక్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఆయా ఎలక్ట్రిక్‌ వాహనాలపై కొనుగోలుదారులకు సులభమైన రిటైల్‌ ఫైనాన్సింగ్‌ లభించనుంది. 

మరింత సులువుగా..!
హీరో ఎలక్ట్రిక్‌ పోర్ట్‌ఫోలియోలోని ఎలక్ట్రిక్‌ బైక్స్‌ కొనుగోలుపై సులభమైన, అవాంతరాలు లేని రిటైల్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను కొనుగోలుదారులకు అందించనుంది .ఈ ఫైనాన్సింగ్‌ సౌకర్యం 750 కంటే ఎక్కువ డీలర్ల వద్ద లభించనుంది. యాక్సిస్‌ బ్యాంకుతో కంపెనీ చేసుకున్న భాగస్వామ్యంతో హీరో ఎలక్ట్రిక్ కస్టమర్‌లు  కనీస డాక్యుమెంటేషన్‌తో భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చునని కంపెనీ వెల్లడించింది. 

డిమాండ్‌కు తగ్గట్టుగా..!
గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై భారీ డిమాండ్‌ నెలకొంది. డిమాండ్‌కు తగ్గట్లుగా ఈవీ స్కూటర్ల కొనుగోలులో కస్టమర్లకు ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని హీరో ఎలక్ట్రిక్ CEO సోహిందర్ గిల్ చెప్పారు. పెరుగుతున్న డిమాండ్‌తో నాన్-టైర్ 1 నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు మరింత వేగంగా ఈవీ స్కూటర్లను తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. యాక్సిస్‌ బ్యాంకుతో ఒప్పందం గ్రీన్ మొబిలిటీని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని గిల్ పేర్కొన్నారు.

చదవండి: భారత్‌లో లాంఛ్‌కు ముందే బుకింగ్‌కు టయోటా బ్రేకులు! క్లారిటీ ఇచ్చిన కంపెనీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top