ఎస్‌బీఐ వినియోగదారులకు శుభవార్త!

Here are The Steps to Add a Nominee Through SBI Net Banking - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి ఎస్‌బీఐ వినియోగదారులు ఇంట్లో నుంచే నామినీ పేరు జత చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం ఇక నుంచి ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది.(చదవండి: అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం!)

మీరు బ్యాంక్ అకౌంట్‌ను నామినీ పేరును మూడు రకాలుగా జత చేయవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం లేదా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఒకవేల కనుక మీరు ఎస్‌బీఐ యోనో యాప్ ఇంస్టాల్ చేసుకుంటే అందులోకి లాగిన్ అయిన తర్వాత కింద ఉన్న సర్వీస్ సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లాలి. ఇప్పుడు మీకు ఆన్‌లైన్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు సులభంగానే మీ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఏమైనా అంటే చనిపోతే అయితే అప్పుడు ఆ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బులుపై నామినీకి పూర్తి అధికారం ఉంటుంది.

ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా:

  • మీరు మీ యూజర్‌పేరు, పాస్‌వర్డ్‌తో onlinesbi.com లోకి లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయిన తరువాత మెను నుంచి 'రిక్వెస్ట్ & ఎంక్వైరీస్' టాబ్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ఆన్‌లైన్ నామినేషన్ ఎంపికను ఎంచుకోండి.
  • మీరు కొత్త నామినీని ఏ ఖాతాకు జోడించాలని అనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోండి. 
  • ఇప్పుడు 'ప్రొసీడ్' టాబ్‌పై క్లిక్ చేయండి.
  • నామినీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఖాతాదారుడితో సంబంధిత వివరాలు నమోదు చేయండి
  • ఇప్పుడు "సబ్మిట్" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన హై-సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
  • కొత్త నామినీని జోడించడానికి 'Confirm' టాబ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top