SBI YONO: నిలిచిపోయిన ఎస్‌బీఐ యోనో సేవలు | SBI YONO services remain unavailable: Here's why? | Sakshi
Sakshi News home page

SBI YONO: నిలిచిపోయిన ఎస్‌బీఐ యోనో సేవలు

Jan 10 2024 12:17 PM | Updated on Jan 10 2024 12:30 PM

SBI YONO services unavailable - Sakshi

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI)కు చెందిన యోనో (YONO) యాప్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు యోనో యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ స్వయంగా కస్టమర్లకు తెలియజేసింది.

ఈ మేరకు ఎస్‌బీఐ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ పోస్టు చేసింది. "సాంకేతిక సమస్యల కారణంగా, యోనో సేవలు 2024 జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి మా ఇతర డిజిటల్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి" అని ఎస్‌బీఐ పేర్కొంది. కాగా బుధవారం ఉదయం 10.30 గంటల తర్వాత ఎస్‌బీఐ యోనో యాప్‌ సేవలు తిరిగి పునరుద్ధరించినట్లుగా తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement