State Bank of India Server is Down Across India - Sakshi
Sakshi News home page

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

Jun 30 2022 6:14 PM | Updated on Jun 30 2022 7:08 PM

State Bank of India Server is Down Across India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి యోనో యాప్‌, యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లో కూడా నగదు ఉపసంహరణ జరగడం లేదని వాపోతున్నారు.

ఎస్‌బీఐ బ్యాంక్‌ సేవలు పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్‌బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు. అంతేగాక నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్‌ సేవలు స్తంభించడంపై ఎస్‌బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement