హెచ్‌డీఎఫ్‌సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే.. | HDFC Bank announces temporary unavailability of UPI systems on Saturday July 13 | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..

Jul 2 2024 12:13 PM | Updated on Jul 2 2024 12:19 PM

HDFC Bank announces temporary unavailability of UPI systems on Saturday July 13

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌(సీబీఎస్‌)ను కొత్త ఇంజినీరింగ్‌ ప్లాట్‌ఫారమ్‌కు మారుస్తున్న నేపథ్యంలో యూపీఐ సేవలను తాత్కాలికంగా కొన్నిగంటల పాటు నిలిపేస్తామని ప్రకటించింది. దానికోసం జులై 13, 2024 శనివారం ఉదయం 3:00 నుంచి 3:45 వరకు, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యూపీఐ సేవలు పనిచేయవని తెలిపింది.

బ్యాంకింగ్‌ పనితీరు, సామర్థ్యం, ​​విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని బ్యాంక్‌ ప్రకటనలో చెప్పింది. కస్టమర్లకు మరింత వేగంగా సేవలందించేందుకు ఈ మైగ్రేషన్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. బ్యాంక్‌ సర్వర్లను యాక్సెస్‌ చేసేపుడు అధిక ట్రాఫిక్ వాల్యూమ్‌ను నిర్వహించడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: సైన్యానికి సేవలందించే చిప్‌ ఆధారిత 4జీ బేస్‌ స్టేషన్‌

శనివారం బ్యాంక్‌ సెలవు కావడంతో ఈ అప్‌డేషన్‌ కోసం జులై 13ను ఎంచుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. యూపీఐ వినియోగదారులు మాత్రం శనివారం బ్యాంక్‌ ప్రకటించిన సమయాన్ని గమనించాలని కోరింది. కస్టమర్లు అంతకు ముందుగానే బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement