వొడాఫోన్‌ను పీఎస్‌యూగా మార్చే ప్రసక్తే లేదు | Govt Wonot Increase Stake In Vodafone Idea says Telecom Minister Scindia | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌ను పీఎస్‌యూగా మార్చే ప్రసక్తే లేదు

Jul 3 2025 5:31 AM | Updated on Jul 3 2025 8:07 AM

Govt Wonot Increase Stake In Vodafone Idea says Telecom Minister Scindia

ప్రభుత్వ వాటా 49 శాతానికి మించరాదు

టెలికం సేవలలో కనీసం 4 కంపెనీలు 

బకాయిలను ఈక్విటీ మార్పుగా కోరవచ్చు 

టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సిందియా

న్యూఢిల్లీ: దేశీ మొబైల్‌ టెలికం రంగంలో కనీసం 4 కంపెనీలు సేవలందించేలా చూడాల్సి ఉందని  కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన దేశీ టెలికం రంగంలోని పలు అంశాలపై మాట్లాడారు. రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్‌ ఐడియా(వీఐ)లో ప్రభుత్వం మరింత ఈక్విటీ వాటాను తీసుకోదని తేల్చి చెప్పారు. వీఐను ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)గా మార్చబోమని స్పష్టతనిచ్చారు. టెలికం కంపెనీలలో ప్రభుత్వ వాటా 49 శాతానికి మించడానికి అనుమతించబోమని తెలియజేశారు. 

ఇటీవల వీఐ ఈక్విటీ మారి్పడి అవకాశాలను అన్వేíÙస్తున్న నేపథ్యంలో సిందియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా.. ప్రతీ టెలికం కంపెనీకి బకాయిలను ఈక్విటీ మార్పు చేయాలని కోరే హక్కు ఉన్నట్లు వెల్లడించారు. అయితే అన్ని కంపెనీలకూ ఒకే నిబంధనలు వర్తించవని, ఆయా కంపెనీల పరిస్థితులకు అనుగుణంగా టెలికం శాఖ(డాట్‌)తోపాటు.. ఆర్థిక శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలన తదుపరి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని వివరించారు. భారతీ టెలికం ఈ హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై డాట్‌ పరిశీలన, విశ్లేషణ పూర్తయితే ఒక నిర్ణయాన్ని తీసుకోగలమని తెలియజేశారు.  
పోటీ ఉండాలి 
టెలికంలోనే కాకుండా ఏ రంగంలో అయినా రెండే కంపెనీలు ఆధిపత్యం వహించడం మంచి పరిణా మం కాదని సిందియా పేర్కొన్నారు. దేశీయంగా మొబైల్‌ టెలికం విభాగంలో పోటీ పరిస్థితులు కొనసాగాలని తెలియజేశారు. పోటీ నివారణ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మొబైల్‌ టెలికం రంగంలో 4 కంపెనీలు సర్వీసులందిస్తున్న దేశాలు తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు. టెలికం పెట్టుబడి వ్యయాలలో దేశీ కంపెనీలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క భారత్‌లో మాత్రమే పెట్టుబడులపై మంచి రిటర్నులు లభిస్తున్నట్లు తెలియజేశారు. ఇది లాభదాయకతపై ఆయా కంపెనీలు, యాజమాన్యాల నిర్ణయాలను బట్టి ఉంటుందని వివరించారు.    

శాటిలైట్‌ సేవలు 
శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ కోసం స్పెక్ట్రమ్‌ ధరల నిర్ణయంపై టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) సన్నాహాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా పలు సంస్థలు, వాటాదారులతో చర్చలు, సూచనలు తదితరాలకు తెరతీసినట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా తగిన సిఫారసులతోకూడిన నివేదికను దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు. ట్రాయ్‌ సలహాలు అమలు చేసేందుకు రెండు నెలలు పట్టవచ్చని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement