ఎల్‌ఐసీ ఐపీవోపై యుద్ధం ఎఫెక్ట్‌ | Govt may delay LIC IPO due to Russia-Ukraine conflict | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఐపీవో వాయిదా!

Mar 3 2022 4:07 AM | Updated on Mar 3 2022 10:55 AM

Govt may delay LIC IPO due to Russia-Ukraine conflict - Sakshi

న్యూఢిల్లీ: వారం రోజులుగా రష్యా– ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ముడిచమురు, బంగారం ధరలకు రెక్కలురాగా.. డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల బాటలో దేశీయంగానూ ఇండెక్సులు భారీ ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ లిస్టింగ్‌ను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి గరిష్ట విలువ లభించేందుకు అనువైన పరిస్థితులున్నప్పుడు మాత్రమే ఐపీవోకు వెళ్లడం ఉచితమని భావిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement