ఆర్థిక మోసాలపై డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం

Government to set up digital intelligence unit to tackle pesky calls - Sakshi

కేంద్ర టెలికం శాఖ నిర్ణయం

న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్‌తో పాటు టెలికం వనరుల ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేయడంపై టెలికం శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ను, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ‘అనవసర కాల్స్, మెసేజీలతో టెలికం యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్న టెలీమార్కెటర్లు, ఇతరత్రా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. టెలికం వనరులను ఉపయోగించుకుని సామాన్యుడి కష్టార్జితాన్ని దోచేసే ఆర్థిక మోసాలు కూడా జరుగుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు‘ అని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (డీఐయూ) ఏర్పాటవుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top