ఇంక దేంట్లో.. మందు కొట్టడంలో.. అమెరికా నిఘా సంస్థ సీఐఏ రూపొందించిన నివేదిక ప్రకారం.. ఆల్కహాల్ సగటు విని యోగంలో కుక్ ఐల్యాండ్స్ మొదటి స్థానంలో ఉండగా.. మన దేశం 111వ స్థానంలో ఉంది. మొత్తం 189 దేశాల్లో ప్రజల వినియోగాన్ని పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. టాప్–10లో కుక్ ఐల్యాండ్స్‌తోపాటు లాట్వియా, చెకియా, లిథువేనియా, ఆస్ట్రియా, అంటిగా అండ్ బర్బూడ, ఎస్టోని యా, ఫ్రాన్స్, బల్గేరియా, స్లొవేనియా ఉన్నాయి. నివేదిక కోసం 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారి వినియో గాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఫస్ట్ టైంరా చారీ.. ఓ విషయంలో వెనకబడి ఉన్నందుకు.. ఫుల్ కిక్కురా.. కిక్కు


