భారత తొలి మహిళ డాక్టర్‌ ఎవరో తెలుసా...?

Google Honours Indian First Female Doctor With A Doodle On Her 160th Birthday - Sakshi

కోల్‌కతా: భారత తొలి మహిళ డాక్టర్‌ కాదంబిని గంగూలీ. ఆనాటి పురుషాధిక్య సమాజంలో గెలిచి, విజయవంతంగా డాక్టర్ విద్యను పూర్తి చేశారు.  నేడు గంగూలీ పుట్టినరోజు. కాదంబిని గంగూలీ జూలై 18, 1861 జన్మించారు. కాదంబిని గంగూలీ 160 వ జయంతిని పురస్కరించుకొని గూగుల్‌ డూడల్‌ను విడుదల చేసింది. డూడుల్‌లో భాగంగా కోల్‌కతా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ప్రధాన భవనం  చిత్రంతో పాటు గంగూలీ ఫోటో వచ్చేలా గూగుల్‌ డూడుల్‌ను రూపొందించింది. కాగా ఈ డూడుల్‌ను బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ ఒడ్రిజా రూపొందించారు. రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు గంగూలీని దేశంలో మహిళల హక్కులకోసం పాటుపడిన వ్యక్తిగా కీర్తించారు.

గంగూలీ ఆనాటి సమాజపు పోకడలను పట్టించుకోకుండా ముందుకు సాగింది. కాగా గంగూలీకి సమాజం నుంచి అనేక విమర్శలను ఎదుర్కొంది. ఎడిన్బగ్ నుంచి భారత్‌కి తిరిగి వచ్చి మహిళల హక్కుల కోసం ప్రచారం చేసింది. ఒకానొక సమయంలో బెంగాలీ పత్రిక  ఆమెను పరోక్షంగా  బంగాబాషిలో 'వేశ్య' అని పిలిచింది. ఆమె భర్త ద్వారకానాథ్ గంగూలీ ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లి గెలిచారు, 6 నెలల జైలు శిక్షతో ఎడిటర్ మహేష్ పాల్‌కు శిక్షను విధించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top