‘కంటెంట్‌ను లాగేస్తున్న గూగుల్‌’.. సీఈఓ ఏమన్నారంటే.. | Google CEO Sundar responded to criticism from news publishers on AI feature | Sakshi
Sakshi News home page

‘కంటెంట్‌ను లాగేస్తున్న గూగుల్‌’.. సీఈఓ ఏమన్నారంటే..

May 29 2025 3:09 PM | Updated on May 29 2025 3:35 PM

Google CEO Sundar responded to criticism from news publishers on AI feature

ఆన్‌లైన్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో దూసుకుపోతున్న గూగుల్‌ ఉపయోగిస్తున్న ఏఐ ఫీచర్లకు సంబంధించి కొన్ని సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొన్ని కంటెంట్‌ పబ్లిషర్‌ సంస్థలు నేరుగా యూజర్లు తమ వెబ్‌సైట్‌లోకి రాకుండా గూగుల్‌ అనైతికంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తుందని వాదిస్తున్నాయి. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ స్పందించారు.

ఏఐ జనరేటెడ్ సమాధానాలను అందించే గూగుల్ ఏఐ ఫీచర్ల ద్వారా వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ తగ్గుతుందని కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యూస్ మీడియా అలయన్స్ గూగుల్ బలవంతంగా తమ కంటెంట్‌ను తీసుకుంటుందని అని ఇటీవల ఆరోపించింది. అనైతికంగా గూగుల్‌ తమ కంటెంట్‌ను దొంగలిస్తుందని వాదిస్తోంది.

ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామం

గూగుల్ పనితీరును సమర్థించిన సుందర్ పిచాయ్.. ‘మేము ఇప్పటికీ యూజర్లను వెబ్‌లో సెర్చ్‌ చేసేందుకు చాలా డబ్బు వెచ్చిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ మరింత మెరుగ్గా వెబ్‌సైట్‌లకు ట్రాఫిక్‌ను అందించేందుకు రూపొందించారు. వినియోగదారులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు కృత్రిమ మేధ ద్వారా నేరుగా సమాధానాలు లభించినప్పటికీ, వారికి విస్తృతమైన వనరులుగా వెబ్‌సైట్‌లు నిలుస్తున్నాయి. అయితే వ్యక్తిగత ప్రచురణకర్తలు తమ వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌లో తేడాలను చూసే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్‌ వృద్ధి ధోరణి క్రమంగా పెరుగుతోంది. వెబ్‌సైట్‌ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏఐ ఓవర్‌వ్యూలను మెరుగుపరిచేందుకు గూగుల్‌ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement