గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!

Google is Bringing Android Games To Windows Devices in 2022 - Sakshi

గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరపోయే శుభవార్త తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ల్యాప్ టాప్, పీసీ, ట్యాబ్లెట్ వంటి పరికరాలలోని విండోస్ ప్లాట్‎ఫామ్ లో కూడా ఎటువంటి చింత లేకుండా గేమ్స్ ఆడేందుకు ప్రత్యేక ప్లాట్‎ఫామ్ తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు విండోస్ ప్లాట్‎ఫామ్ మీద గేమ్స్ ఆడాలంటే వేర్వేరు పోర్టల్ నుంచి గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్ లాగా ఒకే దగ్గర కావు, దీంతో గేమింగ్ ప్రియులు కొంత అసౌకర్యానికి గురి అయ్యేవారు. గేమింగ్ లవర్స్ ఆసక్తిని గమనించిన గూగుల్ విండోస్ ప్లాట్‎ఫామ్ లో కూడా ప్లే స్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్‎ఫామ్ తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. 

గేమ్ అవార్డ్స్ 2021 సందర్భంగా హోస్ట్ జియోఫ్ కీగ్లీ ప్రధాన క్రాస్ ప్లాట్‎ఫామ్ ప్రకటన చేశారు. గూగుల్ నిర్మించిన గూగుల్ ప్లే గేమ్స్ యాప్ విండోస్ ప్లాట్‎ఫారంపై కూడా లభ్యం కానుంది. దీంతో గేమింగ్ లవర్స్ తమ విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ గేమ్స్ అడుకోవచ్చు. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లేలోని గేమ్స్ గురుంచి గూగుల్ ప్రొడక్ట్ డైరెక్టర్ గ్రెగ్ హార్ట్రెల్ ది వెర్జ్ తో మాట్లాడుతూ.. గెమర్స్ మరిన్ని పరికరాల్లో గూగుల్ ప్లే గేమ్స్ పొందగలరు. వారు త్వరలో ఫోన్, టాబ్లెట్, క్రోమ్ బుక్, విండోస్ పీసీ మధ్య ఎటువంటి అంతరాయం లేకుండా గేమ్స్ ఎంజాయ్ చేయగలరు అని అన్నారు. లాంఛ్ తేదీ గురుంచి ఖచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడించలేదు.

(చదవండి: భారత్‌ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్‌ సూసీ నివేదిక)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top