సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు!

Good News: Edible Oil Decreases 11 To 26 Pc In Last 6 Months Says Central Govt - Sakshi

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నిత్యవసరాల సరుకుల ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కాస్త ఊరటరానుంది. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Cooking Oil) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత కొన్ని నెలల్లో ఆహార చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ తగ్గుదలకు కారణమని పేర్కొంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు 200-300 డాలర్లు తగ్గాయి. దీని ప్రభావం భారత్‌లోని రిటైల్ మార్కెట్‌లో కూడా కనిపించడం ప్రారంభించిందని తెలిపింది. 

సామాన్యులకు రిలీఫ్‌.. ధరలు తగ్గాయ్‌!
దేశవ్యాప్తంగా వీటిపై ఓ లుక్కేస్తే..  RBD పామోలిన్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వనస్పతి రిటైల్ ధరలు గత 6 నెలల్లో 26%, 9%, 12%, 9% 11% తగ్గాయి. గత మూడు నెలల్లో, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ సగటు దేశీయ రిటైల్ ధరలు కిలోకు రూ.181 నుంచి రూ.170కి తగ్గింది. వనస్పతి ధరలు రూ.154 నుంచి రూ.146, రిఫైన్డ్ సోయాబీన్ రూ.157 రూ. 154 తగ్గింది. 

మహమ్మారి, సరఫరా కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలను అరికట్టడానికి దిగుమతి సుంకాలు,  పప్పులపై సెస్ తగ్గింపు, సుంకాల హేతుబద్ధీకరణ, తినదగిన నూనెలు, నూనెగింజలపై స్టాక్ పరిమితులను విధించడం, బఫర్ స్టాక్ నిర్వహణ వంటి పలు నిర్ణయాల కారణంగా వంట నూనె ధరలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన ఫలితంగా చమురు ధరలు తగ్గాయి. ప్రస్తుతం తగ్గించిన సుంకం పూర్తి ప్రయోజనాన్ని ప్రజలకు అందేలా చూడాలని పరిశ్రమలను  కేంద్రం కోరింది.

చదవండి: ఆ కంపెనీ భారీ ప్లాన్‌.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top