బంగారం కొనే వారికి గుడ్‏న్యూస్ | Sakshi
Sakshi News home page

బంగారం కొనే వారికి గుడ్‏న్యూస్

Published Fri, Feb 5 2021 8:00 PM

Gold Rate Slashes Today on 05 February 2021 - Sakshi

న్యూఢిల్లీ: బంగారం కొనాలనుకునే వారికీ గుడ్‏న్యూస్. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగిన కూడా దేశీయ మార్కెట్ లో పసిడి ధరలు పడిపోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రకటించడంతో ఆ ప్రభావం పసిడిపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దింతో ఏడు నెలల కనిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి.(చదవండి: రిలయన్స్ జోరుకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్)

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారు రేట్లు తగ్గుతూ వచ్చాయి. ఎంసిఎక్స్‌లో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.440 క్షిణించి రూ.48,380 చేరుకుంది. బెంగుళూరు నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.44,350గా ఉంది. కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.440 క్షిణించి రూ.48,380 చేరుకోగా పది గ్రాముల 22క్యారెట్ల బంగారం 400 పతనంతో 44,350 రూపాయలకు చేరుకుంది. దింతో పాటు కేజీ వెండిపై వెయ్యి రూపాయలు దిగొచ్చి రూ.72 వేల 200కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Advertisement
Advertisement