బంగారం పెరిగినా డాలరుకు ప్రాధాన్యం తగ్గదు..

Gold rally on weaker dollar may not last long - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగితే డాలరు ప్రాధాన్యం కోల్పోతుందనుకోవడం సరైన అంచనా కాకపోవచ్చని ఆర్థిక నిపుణుడు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తెలిపారు. డాలరు మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుందని, ఈ కారణంతో డాలరు పని ఇక అయిపోయిందనే పుకార్లు వినిపిస్తుంటాయని పేర్కొన్నారు. కానీ బలహీనపడిన ప్రతీసారీ అది పుంజుకుంటూనే ఉందని తెలిపారు.

అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఆ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, డాలరుకు ఉన్న ప్రాధాన్యతకు సవాళ్లు ఎదురైనా తాత్కాలికమేనని 75 ఏళ్ల చరిత్ర చెబుతోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరిగేందుకు, ధర ఎగబాకేందుకు అవకాశాలున్నాయి గానీ డాలరు పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థికవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top